త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన సమంత.. ‘ఆయన రియల్ హీరో’ అంటూ ఎమోషనల్ పోస్ట్!

తమిళనాడు సీఎం దళపతి విజయ్‌ను స్టార్ హీరోయిన్ సమంత చెన్నైలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

J

Entertainment | Published On Jun 17, 2026, 10.00 pm IST

Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన సమంత.. ‘ఆయన రియల్ హీరో’ అంటూ ఎమోషనల్ పోస్ట్!

సంక్షిప్త సారాంశం

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించిన దళపతి విజయ్‌ను చెన్నైలో నటి సమంత కలిశారు. విజయ్ కేవలం సిల్వర్ స్క్రీన్‌పైనే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరో అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కొనియాడారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో కత్తి, తెరి, మెర్సల్ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. సమంత నటించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' ఈ శుక్రవారం (జూన్ 19న) గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Advertisement

Samantha meets TN CM Vijay | త్రినేత్ర.న్యూస్ : కత్తి, తెరి, మెర్సల్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత దళపతి విజయ్ (Thalapathy Vijay), సమంత (Samantha) మరోసారి కలుసుకున్నారు. అయితే ఈసారి వెండితెరపై కాదు.. రియల్ లైఫ్‌లో! తమిళనాడు ముఖ్యమంత్రిగా భారీ విజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టిన విజయ్‌ను బుధవారం చెన్నైలో సమంత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సామ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

మన సీఎంను కలవడం స్పెషల్..

చెన్నైకి రావడం ఎప్పుడూ స్పెషలే కానీ, ఈసారి ఏకంగా "మన సీఎం"ను కలవడం మరింత ప్రత్యేకం అంటూ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోస్ట్‌లో రాసుకొచ్చారు. "విజయ్ సార్‌ కేవలం తెరపై హీరోగా మిగిలిపోయే వ్యక్తి కాదని నాకెప్పుడూ అనిపించేది. ఆయన ఎనర్జీ, ప్రెజెన్స్, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్న తీరు చూస్తే.. ఆయన ఇంకా ఏదో సాధించడానికే పుట్టారనిపిస్తుంది" అని ఆమె ప్రశంసించారు.

Image

ఆ ధైర్యం అందరికీ ఉండదు!

రాజకీయాల్లోకి రావడంపై సమంత స్పందిస్తూ.. "ఒక రంగంలో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడు, దాన్ని వదిలేసి పూర్తి కొత్త రంగంలోకి అడుగుపెట్టాలంటే ఎంతో ధైర్యం కావాలి. అది ఈజీ కాదు. కానీ ప్రజలకు మంచి చేయాలనే నమ్మకంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాలని మనమందరం ఏదో ఒక దశలో అనుకుంటాం, కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఆ పని చేస్తారు" అని విజయ్ నిర్ణయాన్ని సమర్థించారు. ఆయన పదవిని చూసి కాకుండా, ఆయనకున్న ఇంటెన్షన్ (intent) చూసి ప్రజలు ఆశ్చర్యపోయే రోజు వస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. యువత తమ కలల కంటే ఇంకా గొప్పగా ఆలోచించడానికి విజయ్ ప్రయాణం ఒక ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుందని ఆమె ఆకాంక్షించారు.

ముచ్చటగా మూడోసారి.. ఇప్పుడేమో రాజకీయాల్లో..

గతం విషయానికొస్తే.. దళపతి విజయ్, సమంత కాంబోలో వచ్చిన కత్తి (2014), తెరి (2016), మెర్సల్ (2017) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఫ్యాన్స్ సైతం వీరు మళ్లీ కలిసి నటిస్తే చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూశారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం సమంత నటిస్తున్న తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) విడుదలకు సిద్ధమైంది. డైరెక్టర్ నందిని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సమంత, హిమాంక్ దువ్వూరుతో కలిసి ఆమె భర్త, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు నిర్మించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా.. ఖుషీ (2023) తర్వాత సామ్ నటిస్తున్న కమ్‌బ్యాక్ మూవీ. ఈ శుక్రవారం (జూన్ 19న) ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement

తాజావార్తలు

Advertisement