త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | రెండు వారాల ముందే థియేట‌ర్ల‌లోకి స‌మంత మా ఇంటి బంగారం?

స‌మంత మా ఇంటి బంగారం అనుకున్న డేట్ కంటే రెండు వారాల ముందే థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన రామ్‌చ‌ర‌ణ్‌ పెద్ది వాయిదాప‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. పెద్ది పోస్ట్‌పోన్‌తో ఆ డేట్‌కు స‌మంత మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

N

Entertainment | Published On Mar 30, 2026, 12.56 pm IST

Samantha | రెండు వారాల ముందే థియేట‌ర్ల‌లోకి స‌మంత మా ఇంటి బంగారం?
Advertisement

Samantha |  టాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు సంబంధించి రిలీజ్ డేట్స్ క‌న్ఫ్యూజ‌న్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఓ సారి వాయిదాప‌డ్డ రామ్‌చ‌ర‌ణ్ పెద్ది ఏప్రిల్ 30న కూడా విడుద‌ల కావ‌డం అనుమాన‌మేన‌ని అంటున్నారు. పెద్ది షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఏప్రిల్ 30లోపు పూర్తికావ‌డం అనుమాన‌మేనని ప్ర‌చారం జ‌రుగుతోంది. దాంతో మ‌రోసారి పెద్ది పోస్ట్‌పోన్ కావ‌డం దాదాపు ఖాయ‌మేన‌ని అంటున్నారు.

రెండు వారాల ముందే...

ఇప్ప‌టికే పెద్దితో పోటీ కార‌ణంగా లెనిన్ మూవీ జూన్‌కు వెళ్లిపోయింది. దాంతో పెద్ది డేట్‌కు స‌మంత మా ఇంటి బంగారం మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కుతోన్న మా ఇంటి బంగారం సినిమాను మే 15న థియేట‌ర్ల‌లోకి తీసుకురాబోతున్న‌ట్లు గ‌తంలో మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. పెద్ది వాయిదాతో మా ఇంటి బంగారం రెండు వారాల ముందే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించి మ‌రో రెండు మూడు రోజుల్లో అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ట‌.

స‌మంత నిర్మాత‌...

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా మోహ‌స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత స్వ‌యంగా నిర్మిస్తోంది. దిగంత్‌, గుల్ష‌న్ దేవ‌య్య కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.
ఓ ఉమ్మ‌డి కుటుంబంలోకి అడుగుపెట్టిన కొత్త కోడ‌లి క‌థ‌తో మా ఇంటి బంగారం మూవీ తెర‌కెక్కుతోంది. మెట్టినింటి అల‌వాట్లు, ఆచారాల‌కు భిన్న‌మైన మ‌న‌స్త‌త్వం క‌లిగిన ఆ కోడ‌లు అత్తింట్లో ఎలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొంది? ఆమె గ‌తం ఏమిటి? అనే అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో స‌మంత యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఆమెపై తెర‌కెక్కించిన ఫైట్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటాయ‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

రెండేళ్ల త‌ర్వాత‌...

మా ఇంటి బంగారం మూవీతో దాదాపు రెండేళ్ల త‌ర్వాత హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది స‌మంత‌. చివ‌ర‌గా 2023లో వ‌చ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషిలో హీరోయిన్‌గా న‌టించింది. ఆ త‌ర్వాత విడాకులు, మ‌యోసైటీస్ కార‌ణంగా రెండేళ్లు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చింది.

Advertisement

తాజావార్తలు

Advertisement