Samantha | ప్రమోషన్లు లేవు.. అప్‌డేట్స్ లేవు.. సమంత మా ఇంటి బంగారం వాయిదా పడనుందా?
సమంత మా ఇంటి బంగారం మూవీ పోస్ట్‌పోన్ కానుందంటూ ప్రచారం జరుగుతోంది. సినిమా రిలీజ్‌కు మరో పది రోజులే టైమ్ ఉంది. కానీ ప్రమోషన్స్ సందడి కనిపించకపోవడం, ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో మా ఇంటి బంగారం వాయిదా పడటం కన్ఫామ్ అని అంటున్నారు.
Entertainment | Published On May 5, 2026, 2.16 pm IST
Samantha | గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు పోస్ట్‌పోన్ కావడం కామన్‌గా మారిపోయింది. చెప్పిన డేట్‌కు సినిమా రిలీజ్ కావడమే ఇప్పుడు గొప్పగా మారిపోయింది. పెద్ది, ప్యారడైజ్‌తో పాటు పలు పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ డేట్స్ ఇప్పటికీ రెండు, మూడు సార్లు మారిపోయాయి. తాజాగా ఈ పోస్ట్‌పోన్ లిస్ట్‌లో సమంత మా ఇంటి బంగారం కూడా చేరనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
లేడీ ఓరియెంటెడ్...
సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత స్వయంగా ఈ సినిమాను నిర్మించింది. మా ఇంటి బంగారం మూవీతోనే హీరోయిన్‌గా దాదాపు మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది సమంత.
పది రోజులే టైమ్
ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీని మే 15న రిలీజ్ చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. విడుదలకు మరో పది రోజులు మాత్రమే టైమ్ ఉంది. కానీ ప్రమోషన్స్ సందడి అస్సలు కనిపించడం లేదు. ఎలాంటి అప్‌డేట్స్ కూడా రివీల్ చేయడం లేదు. సమంత అండ్ టీమ్ సైలెంట్‌గా ఉండటంతో మా ఇంటి బంగారం పోస్ట్‌పోన్ కానుందంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రమోషన్స్ చేయడం లేదని అంటున్నారు.
ఐపీఎల్ ఎఫెక్ట్...
మా ఇంటి బంగారం సినిమాకు సంబంధించిన కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయట. వాటికి తోడు ఐపీఎల్ ఎఫెక్ట్ కారణంగా థియేటర్లకు వచ్చే ఆడియెన్స్ సంఖ్య బాగా తగ్గింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. యశ్ టాక్సిక్ ఫోస్ట్‌పోన్ కావడంతో జూన్ ఫస్ట్ వీక్ స్లాట్ ఖాళీగా మారింది. టాక్సిక్ డేట్‌కు సమంత మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని టాక్. త్వరలోనే మా ఇంటి బంగారం మూవీ పోస్ట్‌పోన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
కొత్త కోడలి కథతో...
మా ఇంటి బంగారం మూవీలో గుల్షన్ దేవయ్య, దిగంత్, శ్రీముఖి, గౌతమి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓ గొప్పింటిలోకి కొత్త కోడలిగా అడుగుపెట్టిన ఓ యువతి కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. డాన్ అయిన ఆమె కోడలిగా అత్తింటి వారి మెప్పును పొందేందుకు ఎలాంటి కష్టాలు పడిందనే పాయింట్‌లో యాక్షన్ కామెడీగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



