త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | మా ఇంటి బంగారం వచ్చేస్తోంది – రిలీజ్ డేట్ చెప్పేసిన స‌మంత‌

స‌మంత మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా మే 15న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని భ‌ర్త్ రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత స్వ‌యంగా నిర్మిస్తోంది.

N

Entertainment | Published On Feb 22, 2026, 3.49 pm IST

Samantha | మా ఇంటి బంగారం వచ్చేస్తోంది – రిలీజ్ డేట్ చెప్పేసిన స‌మంత‌
Advertisement

Samantha | స‌మంత మా ఇంటి బంగారం రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జ‌బ‌ర్ధ‌స్థ్‌, ఓ బేబీ త‌ర్వాత స‌మంత, నందిని రెడ్డి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న‌ హ్యాట్రిక్ మూవీ ఇది. స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత స్వ‌యంగా ఈ మూవీని నిర్మిస్తోంది. బాలీవుడ్ న‌టుడు గుల్ష‌న్ దేవ‌య్య‌తో పాటు దిగంత్‌, గౌత‌మి, శ్రీముఖి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మే 15న రిలీజ్‌...

మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ డేట్‌ను ఆదివారం స‌మంత రివీల్ చేసింది. మే 15న ఈ క్రైమ్ కామెడీ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్‌లో స‌మంత చీర‌క‌ట్టులో ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తోంది.

తెలంగాణ యాస‌లో...

మా ఇంటి బంగారం మూవీలో మ‌ధ్య త‌ర‌గ‌తి ఇల్లాలిగా, లేడీ డాన్‌గా రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో స‌మంత క‌నిపించ‌బోతున్న‌ది. ఈ సినిమాలో స‌మంత డైలాగ్స్ మొత్తం తెలంగాణ యాస‌లో సాగుతాయ‌ట‌. హీరోయిన్ పాత్ర కోసం తెలంగాణ యాస‌ను స‌మంత నేర్చుకున్న‌ట్లు చెబుతోన్నారు.మా ఇంటి బంగారం షూటింగ్ దాదాపు తుది ద‌శ‌కు చేరుకుంది. మార్చిలో షూటింగ్ కంప్లీట్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాకు సంతోష్ నారాయ‌ణ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

క‌మ్‌బ్యాక్‌....

మా ఇంటిబంగారంతోనే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి క‌మ్‌బ్యాక్ ఇవ్వ‌బోతుంది స‌మంత‌. ఖుషి త‌ర్వాత మూడేళ్ల పాటు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన స‌మంత గ‌త ఏడాది రిలీజైన శుభం మూవీలో గెస్ట్ రోల్‌లో క‌నిపించింది. ట్రాలాలా బ్యాన‌ర్‌పై స‌మంత నిర్మించిన ఫ‌స్ట్ మూవీ. చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా స‌మంత‌కు మంచి లాభాల‌ను తెచ్చిపెట్టింది.
త‌మిళంలో శింబు అర‌స‌న్ మూవీలో స‌మంత హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. హిందీలో స‌మంత చేయాల్సిన ర‌క్త్ బ్ర‌హ్మాండ్ వెబ్ సిరీస్ బ‌డ్జెట్ ఈష్యూస్ వ‌ల్ల ఆగిపోయింది.

Advertisement
Advertisement