Salman Khan | షాకింగ్ లుక్‌లో సల్మాన్ ఖాన్ – కండలవీరుడికి ఏమైంది- ఫ్యాన్స్‌లో ఆందోళన
ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించడంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. సల్మాన్ కొత్త లుక్‌ను ఉద్దేశించిన ఆయన అభిమానులు చేస్తోన్న పోస్ట్‌లు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Jul 19, 2026, 2.46 pm IST
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎప్పుడూ స్టైలిష్ లుక్‌లో ఎనర్జిటిక్‌గా ఉండే ఈ కండలవీరుడు వయసుపైబడినట్లుగా నీరసంగా ఓ వేడుకలో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన ఆరోగ్యంపై రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కు సల్మాన్ ఖాన్ అటెండ్ అయ్యారు. ఈ వేడుకలో క్యాప్ ధరించి క్యాజువల్ షర్ట్, జీన్స్ ధరించి కనిపించారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి చాలా హుషారుగా కనిపించే సల్మాన్ ఈ వేడుకలో మాత్రం డల్‌గా ఉన్నారు. ఆయన ముఖంలో మునుపటి గ్లో మిస్సయ్యింది. సల్మాన్‌ను చాలా మంది ఫ్యాన్స్ గుర్తుపట్టలేకపోయారు.
సిక్స్‌ప్యాక్....
సల్మాన్ కొత్త లుక్‌పై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిట్‌నెస్‌కు సల్మాన్ చాలా ప్రాధాన్యమిస్తుంటారు. లుక్ విషయంలో కాంప్రమైజ్ కారు. మెలిదిరిగిన కండలతో ఎప్పుడూ సిక్స్ ప్యాక్‌లో కనిపించే సల్మాన్ ఖాన్ ఇలా వయసు మళ్లిన వాడిలా కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ బాలీవుడ్ స్టార్ హీరోకు ఏమైంది? ఆరోగ్యం బాగాలేదా అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. మరికొందరు మాత్రం వయసు ప్రభావమని అంటున్నారు. అరవై ఏళ్ల వయసులో యంగ్ లుక్‌లో కనిపించడం ఎలా సాధ్యమంటూ చెబుతున్నారు.
మరికొందరు నెటిజన్లు మాత్రం సినిమా కోసం కొత్త మేకోవర్ కావచ్చునని ట్వీట్స్, పోస్ట్‌లు చేస్తున్నారు. ముంబై ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.
తెలుగు డైరెక్టర్‌తో...
ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది.
మరోవైపు సల్మాన్ హిట్టు కొట్టి మూడేళ్లు దాటిపోయింది. 2023లో వచ్చిన టైగర్ తర్వాత ఈ బాలీవుడ్ స్టార్ హీరో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో వంశీపైడిపల్లి సినిమాపై సల్మాన్ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
Salman Khan has aged the worst among all the 90s actors. This is what happens when you take shortcuts and steroids
Kids, just stay lean, eat healthy food and build a natural body. The biggest fraud this guy is going to pull on his fans in his upcoming movies is hiding his… pic.twitter.com/7MVAW0picw
— Raj (@idfcwau) July 19, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Venkatesh | ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ - ఆదర్శకుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్
- ●Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..
- ●NEET Aspirant Dies | ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. మరో యువతి బలవన్మరణం
- ●Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ - రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్డేట్
- ●Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
- ●Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన

Venkatesh | ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ - ఆదర్శకుటుంబం నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్

Ramchandar Rao | ఖర్గేను తప్పించి యువ నాయకున్ని ఎన్నుకోండి.. మేం నితిన్ నబిన్‌కు అవకాశం ఇచ్చాం కదా..

NEET Aspirant Dies | ఆగని నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు.. మరో యువతి బలవన్మరణం

Bhumi Pednekar | ఛత్రపతి శివాజీని ఓడించిన రాణి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ - రిషబ్ శెట్టి పాన్ ఇండియన్ మూవీపై అప్డేట్






