త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి టాలీవుడ్ హీరోయిన్ మ‌ల‌యాళం కాంట్ర‌వ‌ర్సీయ‌ల్ మూవీ – మ‌రో కేర‌ళ స్టోరీ అంటూ విమ‌ర్శ‌లు

నారి నారి న‌డుమ మురారి ఫేమ్ సాక్షి వైద్య హాల్ మూవీతో గ‌త ఏడాది మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌కు పరిచ‌య‌మైంది. సెన్సార్ అడ్డంకులు, కోర్టు ఆంక్ష‌లతో వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. త్వ‌ర‌లోనే మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Mar 31, 2026, 4.48 pm IST

Malayalam OTT | ఓటీటీలోకి టాలీవుడ్ హీరోయిన్ మ‌ల‌యాళం కాంట్ర‌వ‌ర్సీయ‌ల్ మూవీ – మ‌రో కేర‌ళ స్టోరీ అంటూ విమ‌ర్శ‌లు
Advertisement

Malayalam OTT |  సంక్రాంతికి రిలీజైన నారి నారి న‌డుమ మురారి మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తొలి విజ‌యాన్ని అందుకుంది సాక్షి వైద్య‌. శ‌ర్వానంద్ హీరోగా రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమా చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. చిరంజీవి, ప్ర‌భాస్ వంటి స్టార్ హీరోల సినిమాల‌తో పోటీప‌డి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఇందులో నిత్య పాత్ర‌లో మోడ్ర‌న్ అమ్మాయిగా జోవియ‌ల్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి మెప్పించింది సాక్షి వైద్య‌. నారి నారి న‌డుమ మురారి కంటే ముందు తెలుగులో అఖిల్ అక్కినేని ఏజెంట్‌తో పాటు మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌తో గాంఢీవ‌ధారి అర్జున సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది సాక్షి వైద్య‌. ఈ రెండు సినిమాలు మాత్రం ఆమెకు నిరాశ‌నే మిగిల్చాయి.

మ‌ల‌యాళంలో...

తెలుగులో బిజీగా ఉన్న సాక్షి వైద్య‌ గ‌త ఏడాది హాల్ పేరుతో మ‌ల‌యాళంలో ఓ సినిమా చేసింది. ఈ బ్యూటీ తొలి సినిమానే వివాదాల్లో నిలిచింది. సెన్సార్ అడ్డంకులు, హైకోర్టు ఆంక్ష‌ల మ‌ధ్య థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ యావ‌రేజ్ రిజ‌ల్ట్‌తోనే స‌రిపెట్టుకుంది . తాజాగా హాల్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. త్వ‌ర‌లో మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విష‌యాన్ని ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఏప్రిల్ సెకండ్ వీక్‌లో హాల్ మూవీ మ‌నోర‌మా మ్యాక్స్‌లో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

ముస్లిం అబ్బాయి...క్రిస్టియ‌న్ అమ్మాయి...

హాల్ మూవీలో షేన్ నిగ‌మ్ హీరోగా న‌టించాడు. వీర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జానీ ఆంటోనీ, అబిన్ బినో, మ‌ధుపాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ముస్లిం అబ్బాయితో ప్రేమ‌లో ప‌డిన ఓ క్రిస్టియ‌న్ అమ్మాయి క‌థ‌తో ద‌ర్శ‌కుడు వీర ఈ సినిమాను తెర‌కెక్కించారు. వారి ప్రేమ‌కు కుల‌మ‌తాల‌తో పాటు సామాజిక క‌ట్టుబాట్లు ఎలా అడ్డంకిగా నిలిచాయ‌న్న‌ది ఎమోష‌న‌ల్‌గా ఈ సినిమాలో చూపించారు డైరెక్ట‌ర్‌.

సెన్సార్ అడ్డంకులు...

సెన్సిటివ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో హాల్ మూవీ సెన్సార్ బోర్డు నుంచి ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. బీఫ్ బిర్యానీతో పాటు సినిమాలోని 15 డైలాగ్స్‌ను సెన్సార్ క‌ట్ చేసింది. సినిమాకు ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. దాంతో సెన్సార్ తీరుపై మేక‌ర్స్ హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా హాల్ సినిమా ఉంద‌ని, ఈ మూవీని బ్యాన్ చేయాల‌ని క్యాథ‌లిక్ కాంగ్రెస్ అసోసియేష‌న్ హైకోర్టులో పిటిష‌న్ వేసింది. ల‌వ్ జిహాద్‌ను స‌పోర్ట్ చేసేలా త‌మ మ‌తాన్ని త‌ప్పుగా చూపించార‌ని ఆరోపించారు. మ‌రో కేర‌ళ స్టోరీ మూవీ ఇదంటూ విమ‌ర్శించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement