త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి లోకేష్ క‌న‌గ‌రాజ్ మ‌ల‌యాళం మూవీ – అల్లు అర్జున్ పుష్ప తో కంపేరిజ‌న్స్‌

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ గెస్ట్ రోల్‌లో న‌టించిన మ‌ల‌యాళం మూవీ కాటాల‌న్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆంటోనీ వ‌ర్గీస్ హీరోగా న‌టించిన ఈ మూవీని అల్లు అర్జున్ పుష్ప స్ఫూర్తితో రూపొందించారంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

N

Entertainment | Published On Jul 31, 2026, 10.28 pm IST

Malayalam OTT | ఓటీటీలోకి లోకేష్ క‌న‌గ‌రాజ్ మ‌ల‌యాళం మూవీ – అల్లు అర్జున్ పుష్ప తో కంపేరిజ‌న్స్‌
Advertisement

Malayalam OTT | మ‌ల‌యాళ మూవీ కాటాల‌న్ థియేట‌ర్లలో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఆంటోనీ వ‌ర్గీస్ హీరోగా న‌టించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాలో సునీల్‌, దుషారా విజ‌య‌న్‌, క‌బీర్ సింగ్ దుహాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మ‌ల‌యాళం సినిమాలో కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ గెస్ట్ రోల్‌లో న‌టించారు.

పుష్ప స్ఫూర్తితో...

అల్లు అర్జున్ పుష్ప స్ఫూర్తితో కాటాల‌న్ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ సినిమా కాన్సెప్ట్, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, హీరో పాత్ర చిత్ర‌ణ, సునీల్ క్యారెక్ట‌ర్ ఇవ‌న్నీ పుష్ప‌కు ద‌గ్గ‌రగా ఉన్నాయంటూ ఆడియెన్స్‌ ట్రోల్స్ చేశారు. దాదాపు యాభై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన కాటాల‌న్‌ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ప‌దిహేను కోట్ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

ఓటీటీలోకి...

కాటాల‌న్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మ‌నోర‌మా మ్యాక్స్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కాబోతుంది. ఆగ‌స్ట్ 4 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. కేవ‌లం మ‌ల‌యాళ వెర్ష‌న్ మాత్ర‌మే విడుద‌ల అవుతోంది.

డెబ్యూ మూవీ...

లోకేష్ క‌న‌గ‌రాజ్ యాక్ట‌ర్‌గా క‌నిపించిన ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండా థియేట‌ర్ల‌లోనే ఆయ‌న క్యారెక్ట‌ర్‌ను చూపించిన ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు మేక‌ర్స్‌.

ఏనుగు దంతాల స్మ‌గ్లింగ్‌

కేర‌ళ అడ‌వుల్లో ఏనుగు దంతాల అక్ర‌మ వ్యాపారం చేస్తుంటాడు మారి. అత‌డి వ్యాపారంపై క‌న్నేస్తాడు ఎడ్డీ. పోలీస్‌గా ప‌నిచేసే త‌న సోద‌రుడితో క‌లిసి మారి వ‌ద్ద ఉన్న ఇర‌వై ఐదు కోట్ల ఏనుగు దంతాల‌ను కొట్టేస్తాడు ఎడ్డీ. త‌న స‌రుకును ఎడ్డీ నుంచి తిరిగి సొంతం చేసుకోవ‌డానికి ఆంటోనీ సాయం కోరుతాడు మారి? అస‌లు ఆంటోనీ ఎవ‌రు? ఎడ్డీ నుంచి పాతిక కోట్ల ఏనుగు దంతాల‌ను అత‌డు ఎలా కొట్టేశాడు? మారి కింద ప‌నిచేసే ఆంటోనీ అత‌డికే ఎందుకు ఎదురుతిరిగాడు? అన్న‌దే మిగిలిన క‌థ‌.

 

Advertisement
Advertisement