త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | లెజెండ‌రీ సింగ‌ర్ బ‌యోపిక్‌లో సాయిప‌ల్ల‌వి – అనుష్క‌తో అనుకొని….

Sai Pallavi | లెజెండ‌రీ సింగ‌ర్ ఎమ్ఎస్ సుబ్బుల‌క్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. ఈ బ‌యోపిక్‌లో సాయిప‌ల్ల‌వి లీడ్ రోల్‌లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Dec 15, 2025, 3.28 pm IST

Sai Pallavi | లెజెండ‌రీ సింగ‌ర్ బ‌యోపిక్‌లో సాయిప‌ల్ల‌వి – అనుష్క‌తో అనుకొని….

సాయి పల్లవి

Advertisement

Sai Pallavi | దిగ్గ‌జ క‌ర్ణాట‌క సంగీత క‌ళాకారిణి, భార‌త ర‌త్న అవార్డు గ్ర‌హీత ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి (Ms Subbulaxmi) జీవితం వెండితెర‌పైకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ లెజెండ‌రీ సింగ‌ర్ జీవితంలోని కీల‌క ఘ‌ట్టాల‌ను ఆవిష్క‌రిస్తూ ఓ పాన్ ఇండియ‌న్ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
సింగ‌ర్‌గా ప్ర‌తిభ‌ను చాటుకున్న‌ సుబ్బుల‌క్ష్మి భార‌త‌ర‌త్నతో పాటు ప‌ద్మ‌భూష‌ణ్, ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డుల‌ను అందుకుంది. యూఎన్ఓలో ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన తొలి ఇండియ‌న్ సింగ‌ర్‌గా చ‌రిత్ర‌ను సృష్టించింది. సింగ‌ర్‌గానే కాకుండా కొన్ని సినిమాల్లో యాక్ట‌ర్‌గా కూడా మెరిసింది సుబ్బుల‌క్ష్మి. సేవాస‌ద‌నం, మీరాబాయి, సావిత్రి సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించింది.
ఈ లెజెండ‌రీ సింగ‌ర్ జీవితం ఆధారంగా జెర్సీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి ఓ సినిమాను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి (Sai Pallavi) లీడ్ రోల్‌లో న‌టించ‌నుంద‌ని అంటున్నారు. లెజెండ‌రీ సింగ‌ర్ పాత్ర కోసం ఇటీవ‌లే సాయిప‌ల్ల‌విని మేక‌ర్స్ అప్రోచ్ అయిన‌ట్లు స‌మాచారం. ఛాలెంజింగ్ రోల్ కావ‌డంతో సాయిప‌ల్ల‌వి కూడా ఈ బ‌యోపిక్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.
సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్‌లో హీరోయిన్‌గా మొద‌ట అనుష్క‌ను అనుకున్నారు.ఆ త‌ర్వాత న‌య‌న‌తార పేరు వినిపించింది. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ త‌ర్వాత ఈ బ‌యోపిక్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్ వార్త‌లు తెర‌పైకి రావ‌డం టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది.
ఈ బ‌యోపిక్‌ను గీతా ఆర్ట్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ నిర్మించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సాయిప‌ల్ల‌వితో పాటు ప‌లు భాష‌ల‌కు చెందిన టాప్ యాక్ట‌ర్స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.
ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది సాయిప‌ల్ల‌వి రామాయ‌ణ‌తో పాటు మేరే ర‌హో సినిమాలు చేస్తోంది. వ‌చ్చే ఏడాది ఈ రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement