త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | క‌ల్కి 2కు హీరోయిన్ దొరికిందా? – ప్ర‌భాస్ సినిమాలో ఫ‌స్ట్ టైమ్‌

ప్ర‌భాస్ క‌ల్కి 2 మూవీలో దీపికా ప‌దుకొణే ప్లేస్‌లో న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ రోల్ కోసం సాయిప‌ల్ల‌విని మేక‌ర్స్ ఎంపిక‌చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫిబ్ర‌వ‌రి నుంచి క‌ల్కి 2 రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Jan 28, 2026, 3.00 pm IST

Sai Pallavi | క‌ల్కి 2కు హీరోయిన్ దొరికిందా? – ప్ర‌భాస్ సినిమాలో ఫ‌స్ట్ టైమ్‌
Advertisement

Sai Pallavi |  ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన క‌ల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ రికార్డుల‌ను క్రియేట్ చేసింది. టాలీవుడ్ హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. గ్రాఫిక్స్‌, విజువ‌ల్స్ ఎఫెక్ట్స్ హంగుల‌తో హాలీవుడ్ రేంజ్ సినిమాను తీసే స‌త్తా తెలుగు డైరెక్ట‌ర్ల‌కు ఉంద‌ని ఈ మూవీ నిరూపించింది. క‌ల్కి 2898 ఏడీ మూవీకి కొన‌సాగింపుగా క‌ల్కి 2 రాబోతుంది. ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ సినిమా షూటింగ్ మొద‌లుకాబోతుంది.

దీపికా ప్లేస్‌లో...

ఈ సీక్వెల్ నుంచి దీపికా ప‌దుకొణేనే త‌ప్పించ‌డం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీపికా ప‌దుకొణే ఈ సినిమా చేయ‌డం లేద‌ని గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. రెమ్యూన‌రేష‌న్‌తో పాటు ఎనిమిది గంట‌ల షిప్ట్ రూల్ కార‌ణంగా దీపిక‌ను నిర్మాత‌లు ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

సాయిప‌ల్ల‌వి...

దీపికా ప‌దుకొణే ప్లేస్‌లో ఈ సీక్వెల్‌లో న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. దీపిక ఈ సినిమా నుంచి త‌ప్పుకొని నాలుగు నెల‌లు దాటినా మేక‌ర్స్ మాత్రం హీరోయిన్ పేరును క‌న్ఫామ్ చేయలేదు. ఎట్ట‌కేల‌కు ఎదురుచూపుల‌కు పుల్‌స్టాప్ ప‌డ‌నున్న‌ట్లు స‌మాచారం. దీపిక స్థానంలో సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. క‌ల్కి సీక్వెల్ క‌థ మొత్తం సుమ‌తి పాత్ర ప్ర‌ధానంగానే సాగుతుంది. ఈ ఎమోష‌న‌ల్ రోల్‌కు న్యాయం చేయ‌గ‌లిగే క‌థానాయిక కోసం ప‌లువురు ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ హీరోయిన్ల పేర్ల‌ను ప‌రిశీలించిన మేక‌ర్స్ చివ‌ర‌కు సాయిప‌ల్ల‌విని ఫైన‌ల్ చేసిన‌ట్లు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా ఈ ఫిదా బ్యూటీ పేరును ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్‌తో సాయిప‌ల్ల‌వి చేస్తున్న ఫ‌స్ట్ మూవీ ఇది.

ఫిబ్ర‌వ‌రి నుంచి షూటింగ్‌...

క‌ల్కి 2 షూటింగ్ ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్ నుంచి మొద‌లుకాబోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ప్ర‌భాస్ కూడా ఈ సీక్వెల్ కోసం డేట్స్ కేటాయించిన‌ట్లు స‌మాచారం. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో ప్ర‌భాస్‌తో పాటు క‌మ‌ల్‌హాస‌న్ కూడా పాల్గొన‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రు వ‌ర‌కు ఈ షెడ్యూల్ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. క‌ల్కి సీక్వెల్‌లో అమితాబ్‌బ‌చ్చ‌న్‌, దిశా ప‌టానీ, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, శోభ‌న కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయ‌ణ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. క‌ల్కి 2 మూవీకి వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement