Rukmini Vasanth | రజినీకాంత్ భారీ ప్రాజెక్ట్‌లో ‘కాంతార’ బ్యూటీకి ఛాన్స్..!
Rukmini Vasanth | వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న నటి రుక్మిణి వసంత్‌కు మరో క్రేజీ ప్రాజెక్ట్ దక్కినట్లు సమాచారం. ఇప్పటికే కన్నడ స్టార్ యష్ సరసన నటించిన ‘టాక్సిక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కన్నడ సోయగం.. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తోంది.
Entertainment | Published On Jul 15, 2026, 6.30 pm IST
Rukmini Vasanth | వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న నటి రుక్మిణి వసంత్‌కు మరో క్రేజీ ప్రాజెక్ట్ దక్కినట్లు సమాచారం. ఇప్పటికే కన్నడ స్టార్ యష్ సరసన నటించిన ‘టాక్సిక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కన్నడ సోయగం.. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. రజినీకాంత్ కెరీర్‌లో 173వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన సీనియర్ నటి సిమ్రాన్ నటిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, కీలక పాత్రలో రాశి ఖన్నా కనిపించనుంది. తాజాగా రుక్మిణి వసంత్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. చేతిలో సర్జికల్ బ్లేడ్ పట్టుకుని, రక్తంతో తడిసిన చేతులతో రజినీకాంత్ కనిపించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రజినీకాంత్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో రుక్మిణి వసంత్ పాత్ర ఏంటి అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఆమె రజినీకాంత్‌కు జోడీగా నటించడం లేదని, కథలో కీలకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉందని సమాచారం. ‘కాంతార’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణికి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Fake Number Plates Hyderabad | ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నంబర్ ప్లేట్లు వాడుతున్నారా?
- ●CM Revanth Reddy | చిన్నారెడ్డి గెలిపించండి అని గోడల మీద రాశాను.. నెమరేసుకున్న సీఎం రేవంత్
- ●Harish Rao vs Beerla Ilaiah | సర్పంచ్ కాకముందు నువ్వు ఏం చేసేవాడివో గుర్తుందా? బీర్ల ఐలయ్యకు వార్నింగ్
- ●MLC Dasoju Sravan | సీఎం రేవంత్ 18 గంటలు కష్టపడి ఐటీ పరిశ్రమను చంపేస్తున్నారు : ఎమ్మెల్సీ దాసోజు
- ●Zoho Classes 2.0 | జోహో క్లాసెస్ 2.0 వచ్చేసింది.. ఏఐతో బోధన, విద్యా నిర్వహణ ఇక మరింత సులువు..
- ●Mahabubnagar Journalists Boycott | మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ పర్యటనలో హైడ్రామా.. అధికారుల తీరుపై జర్నలిస్టుల మూకుమ్మడి బహిష్కరణ

Fake Number Plates Hyderabad | ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నంబర్ ప్లేట్లు వాడుతున్నారా?

CM Revanth Reddy | చిన్నారెడ్డి గెలిపించండి అని గోడల మీద రాశాను.. నెమరేసుకున్న సీఎం రేవంత్

Harish Rao vs Beerla Ilaiah | సర్పంచ్ కాకముందు నువ్వు ఏం చేసేవాడివో గుర్తుందా? బీర్ల ఐలయ్యకు వార్నింగ్

MLC Dasoju Sravan | సీఎం రేవంత్ 18 గంటలు కష్టపడి ఐటీ పరిశ్రమను చంపేస్తున్నారు : ఎమ్మెల్సీ దాసోజు






