Sai Pallavi | ధనుష్ పొలిటికల్ ఎంట్రీ – కన్ఫామ్ చేసిన సాయిపల్లవి – కామెంట్లు వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో అడుగుపెడుతున్నాడని, సొంతంగా పార్టీ పెట్టబోతున్నాడంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ఓం మూవీ ప్రమోషన్స్‌లో నాచురల్ బ్యూటీ సాయిపల్లవి ఆసక్తిక కామెంట్లు చేసింది. ఆమె ఏం అన్నదంటే?
Entertainment | Published On Nov 15, 2026, 2.56 pm IST
Sai Pallavi | తమిళనాడు సీఎం దళపతి విజయ్ బాటలోనే మరో కోలీవుడ్ అగ్ర హీరో ధనుష్ (Dhanush) కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా అభిమాన సంఘాల పేరు మీద పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ధనుష్. మధురైతో పాటు మరికొన్ని ఏరియాల్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అంతటితో ఆగకుండా మహిళా అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమైన ధనుష్ వారికి కమలం గుర్తును పోలిన వెండి దీపాలు బహుమతిగా అందజేశారు. దాంతో ధనుష్ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. విజయ్ బాటలోనే సొంతంగా పార్టీ పెట్టి 2031 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా రూమర్లు వినిపిస్తున్నాయి.
అవునని చెప్పలేదు...
అయితే ఇప్పటివరకు తన పొలిటికల్ ఎంట్రీపై ధనుష్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు. రానని ఈ రూమర్లను ఖండించకపోవడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ధనుష్ రాజకీయ అరంగేట్రంపై నాచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) ఆసక్తికర కామెంట్లు చేసింది.
ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్...
ధనుష్ హీరోగా నటిస్తోన్న ఓం మూవీ నవంబర్ 20న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో సాయిపల్లవి ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఎర్రచందనం అక్రమ రవాణా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ రాజ్‌కుమార్ పెరియాసామీ దర్శకత్వం వహిస్తున్నారు.
నటనను కొనసాగించాలి...
ఓం సినిమా ప్రమోషన్స్‌లో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమంటూ సాయిపల్లవి హింట్ ఇచ్చింది. "ఓం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తుంటే దారి పొడవునా జెండాలు కనిపించాయి. అవి చూడగానే పొలిటికల్ పార్టీ మీటింగ్ ఏదో జరుగుతుందని అనుకున్నా. కానీ ధనుష్ అభిమాన సంఘాలకు సంబంధించిన జెండాలని తెలిసింది. దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అభిమానులు ఆయన్ని చాలా మిస్సవుతున్నారు. భవిష్యత్తులో ధనుష్ నిర్ణయం ఏదైనా నటనను మాత్రం కొనసాగించాలని కోరుకుంటున్నా" అని సాయిపల్లవి అన్నది. ఆమె కామెంట్లు వైరల్ అవుతోన్నాయి. ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమని ఇన్‌డైరెక్ట్‌గా సాయిపల్లవి కన్ఫామ్ చేసినట్లు నెటిజన్లు అంటున్నారు. నాచురల్ బ్యూటీ వ్యాఖ్యలు వైరల్ అవుతోన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | సాయిపల్లవి వర్సెస్ శ్రీలీల – “ఓం” సినిమా కోసం ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?
నవంబర్ 14, 2026

Romantic OTT | అర్ధరాత్రి ఇంటిపై రౌడీల ఎటాక్ – ఓటీటీలోకి ట్విస్ట్‌లతో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ
నవంబర్ 14, 2026

Om Movie | టైటిల్ మార్చాల్సిందే – శ్రీలీల తమిళ మూవీకి సెన్సార్ అడ్డంకులు
నవంబర్ 13, 2026
తాజావార్తలు
- ●KCR | హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావుకు కేసీఆర్ నివాళి
- ●Pre Budget | ప్రీ-బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?
- ●Road Accident | మూడు రోజుల్లో పెళ్లి.. కాబోయే వరుడిని మింగేసిన యాక్సిడెంట్.. ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే!
- ●Horror OTT | ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ హారర్ మూవీ - మెడికల్ కాలేజీలో దయ్యం - అమ్మాయిలు అడుగుపెడితే అంతే!
- ●Trump Gold Card | ట్రంప్ గోల్డ్ కార్డ్ చూశారా..? అమెరికాలో స్థిరపడాలంటే ఇది కావాల్సిందే..!
- ●KTR | రాహుల్ బైక్ వెంట మంత్రులు పరుగెత్తడం అవమానకరం

KCR | హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావుకు కేసీఆర్ నివాళి

Pre Budget | ప్రీ-బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?

Road Accident | మూడు రోజుల్లో పెళ్లి.. కాబోయే వరుడిని మింగేసిన యాక్సిడెంట్.. ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే!

Horror OTT | ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ హారర్ మూవీ - మెడికల్ కాలేజీలో దయ్యం - అమ్మాయిలు అడుగుపెడితే అంతే!



