Horror OTT | ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ హారర్ మూవీ – మెడికల్ కాలేజీలో దయ్యం – అమ్మాయిలు అడుగుపెడితే అంతే!
కేజీఎఫ్, సలార్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్మించిన 418 డిఫరెంట్ హారర్ మూవీగా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. నిర్మాతగా ప్రశాంత్ నీల్‌కు లాభాలను తెచ్చిపెట్టిన ఈ హారర్ సినిమా ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Nov 15, 2026, 2.12 pm IST
Horror OTT | కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తొలి సారి నిర్మాతగా మారి తెరకెక్కించిన హారర్ మూవీ 418. చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, సూర్యరాజ్, చైత్ర జే ఆచార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ప్రశాంత్ నీల్ నిర్మించిన ఈ హారర్ మూవీ గత నెలలో థియేటర్లలో రిలీజైంది.
లిమిటెడ్ బడ్జెట్...
లిమిటెడ్ బడ్జెట్, కొత్త నటీనటులతో తెరకెక్కిన 418 మూవీ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా ఈ హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. నవంబర్ 20న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీతో పాటు మలయాళంలో విడుదల అవుతోంది.
సెన్సార్ అడ్డంకులు...
సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదురవ్వడంతో 418 అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. అందులోనూ ప్రశాంత్ నీల్ ప్రొడ్యూసర్ కావడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఓటీటీ, థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. దాదాపు 8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 15 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. చైత్ర జే ఆచార్ యాక్టింగ్‌తో పాటు టెక్నికల్ అంశాలపై ప్రశంసలు వచ్చాయి.
విమ్స్ కాలేజీలో దయ్యం....
విమ్స్ అనే మెడికల్ కాలేజీ సిటీకి దూరంగా అడవి మధ్యలో ఉంటుంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు హాస్టల్ సరిపోకపోవడంతో ఆ కాలేజీ ప్రాంగణంలోనే చాలా ఏళ్లుగా మూతపడి ఉన్న పాత బిల్డింగ్‌ను కాలేజీ యాజమాన్యం ఓపెన్ చేస్తుంది. అందులోకి ఎట్టి పరిస్థితుల్లో మహిళలు రాకూడదు. 418వ నంబర్ రూమ్ ఓపెన్ చేసేందుకు ఎవరూ ప్రయత్నించకూడదు. ఈ రెండు రూల్స్ అతిక్రమించకుండా ఎప్పుడూ సెక్యూరిటీ కాపలాగా ఉంటారు.
వికాస్, రోహిత్, మ్యాగీ, డాక్టర్...కాలేజీలో చేరిన కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోతారు. మెడికల్ కాలేజీలో ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన సయేషా వారి బ్యాచ్‌లో చేరుకుంది. 418 రూమ్‌లో ఏముందో తెలుసుకోవాలని ఐదుగురు అనుకుంటారు. సయేషా హాస్టల్‌లో అడుగుపెట్టిన తర్వాత దేవిక అనే ఆత్మ వారిని వెంటాడటం మొదలుపెడుతుంది. అడ్డొచ్చివారిని దారుణంగా చంపేస్తుంటుంది. అసలు ఆ దేవిక ఎవరు? ఆమె గతం ఏమిటి? 418 రూమ్‌కు దేవికకు ఉన్న సంబంధమేమిటి? ఆ ఆత్మ బారి నుంచి రోహిత్, వికాస్, సయేషా ప్రాణాలను కాపాడుకునేందుకు ఏం చేశారు? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | సాయిపల్లవి వర్సెస్ శ్రీలీల – “ఓం” సినిమా కోసం ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?
నవంబర్ 14, 2026

Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా – “కాంత” కోసం ఆడిషన్ ఇచ్చా కానీ – సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నవంబర్ 14, 2026

Ntr | ఊహించని కాంబో సెట్ – అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ మూవీ
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●KCR | హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావుకు కేసీఆర్ నివాళి
- ●Sai Pallavi | ధనుష్ పొలిటికల్ ఎంట్రీ - కన్ఫామ్ చేసిన సాయిపల్లవి - కామెంట్లు వైరల్
- ●Pre Budget | ప్రీ-బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?
- ●Road Accident | మూడు రోజుల్లో పెళ్లి.. కాబోయే వరుడిని మింగేసిన యాక్సిడెంట్.. ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే!
- ●Trump Gold Card | ట్రంప్ గోల్డ్ కార్డ్ చూశారా..? అమెరికాలో స్థిరపడాలంటే ఇది కావాల్సిందే..!
- ●KTR | రాహుల్ బైక్ వెంట మంత్రులు పరుగెత్తడం అవమానకరం

KCR | హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావుకు కేసీఆర్ నివాళి

Sai Pallavi | ధనుష్ పొలిటికల్ ఎంట్రీ - కన్ఫామ్ చేసిన సాయిపల్లవి - కామెంట్లు వైరల్

Pre Budget | ప్రీ-బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?

Road Accident | మూడు రోజుల్లో పెళ్లి.. కాబోయే వరుడిని మింగేసిన యాక్సిడెంట్.. ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే!



