Road Accident | మూడు రోజుల్లో పెళ్లి.. కాబోయే వరుడిని మింగేసిన యాక్సిడెంట్.. ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే!
Road Accident | ఇంకో మూడు రోజులు గడిస్తే ఆ యువకుడి పెళ్లి.. ఇంటోళ్లు, చుట్టాలంతా కలిసి పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. రాబోయే దాంపత్య జీవనం ఊహల్లో తేలిపోతున్న ఆ కాబోయే పెళ్లి కొడుకు (Groom-to-be)ని ఊహించని రోడ్డు ప్రమాదం (Road Accident) మింగేసింది.
Road Accident | త్రినేత్ర న్యూస్: ఇంకో మూడు రోజులు గడిస్తే ఆ యువకుడి పెళ్లి.. ఇంటోళ్లు, చుట్టాలంతా కలిసి పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. రాబోయే దాంపత్య జీవనం ఊహల్లో తేలిపోతున్న ఆ కాబోయే పెళ్లి కొడుకు (Groom-to-be)ని ఊహించని రోడ్డు ప్రమాదం (Road Accident) మింగేసింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా మృత్యుఘోష వినిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం వికారాబాద్ (Vikarabad) జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన బుడత శ్రీశైలం (28) హైదరాబాద్‌లోని ఓ హోటల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో అతడికి నిశ్చితార్థమైంది. ఈనెల 18న తిరుపతిలోని తితిదే కల్యాణ మండపంలో వివాహం జరిపించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో శ్రీశైలం తన పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి లగచర్లకు కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో తుంకిమెట్ల నుంచి కోస్గి వైపు వెళ్తుండగా బొమ్రాస్‌పేట మండలం నాందార్‌పూర్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారు టైర్ పంక్చర్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన ఇల్లు ఒక్కసారిగా విషన్నవదనంలో మునిగిపోయింది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు గుండలవిసేలా రోదిస్తున్నారు. స్నేహితులు, గ్రామస్థులు కంటతడి పెడుతున్నారు. ఈ హృదయవిదారక ఘటనతో లగచర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
- ●KCR | హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావుకు కేసీఆర్ నివాళి
- ●Sai Pallavi | ధనుష్ పొలిటికల్ ఎంట్రీ - కన్ఫామ్ చేసిన సాయిపల్లవి - కామెంట్లు వైరల్
- ●Pre Budget | ప్రీ-బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?
- ●Horror OTT | ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ హారర్ మూవీ - మెడికల్ కాలేజీలో దయ్యం - అమ్మాయిలు అడుగుపెడితే అంతే!
- ●Trump Gold Card | ట్రంప్ గోల్డ్ కార్డ్ చూశారా..? అమెరికాలో స్థిరపడాలంటే ఇది కావాల్సిందే..!
- ●KTR | రాహుల్ బైక్ వెంట మంత్రులు పరుగెత్తడం అవమానకరం

KCR | హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావుకు కేసీఆర్ నివాళి

Sai Pallavi | ధనుష్ పొలిటికల్ ఎంట్రీ - కన్ఫామ్ చేసిన సాయిపల్లవి - కామెంట్లు వైరల్

Pre Budget | ప్రీ-బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం.. ఈసారి ఇన్వెస్టర్లకు పన్ను ఊరట దక్కేనా?

Horror OTT | ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ హారర్ మూవీ - మెడికల్ కాలేజీలో దయ్యం - అమ్మాయిలు అడుగుపెడితే అంతే!






