KTR | రాహుల్ బైక్ వెంట మంత్రులు పరుగెత్తడం అవమానకరం
KTR | గిగ్ వర్కర్ల ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) బైక్ వెంట రాష్ట్ర మంత్రలు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పరుగెత్తడం అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు.
- కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ ఆత్మగౌరవం ఎప్పటికీ అర్థం కాదు
- పదవులకు తగ్గట్టు ఉండాల్సిన గౌరవం కనిపిస్తలే
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
KTR | త్రినేత్ర న్యూస్: గిగ్ వర్కర్ల ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) బైక్ వెంట రాష్ట్ర మంత్రలు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పరుగెత్తడం అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతల్లో వారి పదవులకు తగ్గట్లు ఉండాల్సిన హుందాతనం, గౌరవం కరువయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు తెలంగాన ఆత్మగౌరవం ఎప్పకిటీ అర్థం కాదన్నారు. ఈమేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రజలు ఇచ్చిన పదవుల గౌరవాన్ని దిగజార్చుతున్నరు
సీఎం రేవంత్ రెడ్డి గాంధీలకు బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ గాంధీ బైక్ వెంట కాంగ్రెస్ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు పరుగులు తీయడం అవమానకరం. అమిత్ షా చెప్పులను తెలంగాణకు చెందిన ఒక కేంద్ర మంత్రి మోస్తే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కాళ్లు మొక్కుతున్నాడు. ప్రజలు ఇచ్చిన పదవుల గౌరవాన్ని దిగజార్చేలా కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల తీరు అత్యంత సిగ్గుచేటు, అవమానకరం.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జాతీయ పార్టీల నేతల వ్యవహారశైలి కొనసాగుతోంది. తెలంగాణ ఆవిర్భావమే ఆత్మగౌరవ పునాదులపై జరిగింది. ఈ రెండు జాతీయ పార్టీలకు ఆ విలువ ఎప్పటికీ అర్థం కాదు అని కేటీఆర్ ట్వీట్‌లో విమర్శించారు.
సంబంధిత వార్తలు

Ramchandar Rao | పోడు భూములను రెగ్యులరైజ్ చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
నవంబర్ 15, 2026

School Education | ఇంకనూ ప్రయోగాలేనా?.. వ్యవస్థను బలోపేతం చేసేదెప్పుడు?
నవంబర్ 15, 2026

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
నవంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Trump Gold Card | ట్రంప్ గోల్డ్ కార్డ్ చూశారా..? అమెరికాలో స్థిరపడాలంటే ఇది కావాల్సిందే..!
- ●Sachin Tendulkar | ఆ బ్యాట్ ఇప్పటికీ నాతోనే ఉంది.. చిన్ననాటి ఫొటోతో సచిన్ ఎమోషనల్ పోస్ట్!
- ●Pending Cases | కోర్టుల్లో కొండలా కేసులు..
- ●Ramchandar Rao | పోడు భూములను రెగ్యులరైజ్ చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
- ●Special Trains | సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. ఆరు సర్వీసులు పొడిగింపు..
- ●SIR | సర్లో పేరు గల్లంతైనా నో ప్రాబ్లమ్.. ఫామ్-6పై ఈసీ క్లారిటీ!

Trump Gold Card | ట్రంప్ గోల్డ్ కార్డ్ చూశారా..? అమెరికాలో స్థిరపడాలంటే ఇది కావాల్సిందే..!

Sachin Tendulkar | ఆ బ్యాట్ ఇప్పటికీ నాతోనే ఉంది.. చిన్ననాటి ఫొటోతో సచిన్ ఎమోషనల్ పోస్ట్!

Pending Cases | కోర్టుల్లో కొండలా కేసులు..

Ramchandar Rao | పోడు భూములను రెగ్యులరైజ్ చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు



