త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | బాలీవుడ్‌ సినిమా అన‌గానే భ‌య‌ప‌డ్డా – రామాయ‌ణ‌పై సాయిప‌ల్ల‌వి కామెంట్స్‌

బాలీవుడ్‌లో సినిమా అన‌గానే భ‌య‌ప‌డ్డాన‌ని సాయిప‌ల్ల‌వి అన్న‌ది. ఇక్క‌డి ప్రోటోకాల్స్‌, సెట్స్‌లో వాతావ‌ర‌ణానికి అడ్జెస్ట్ అవుతానోలేదో అనే కంగారుతోనే షూటింగ్‌లో జాయిన‌య్యాన‌ని చెప్పింది. ర‌ణ‌బీర్‌క‌పూర్ త‌న‌లోని భ‌యాల‌న్నీ పొగోట్టార‌ని తెలిపింది.

N

Entertainment | Published On Oct 20, 2026, 11.06 am IST

Sai Pallavi | బాలీవుడ్‌ సినిమా అన‌గానే భ‌య‌ప‌డ్డా – రామాయ‌ణ‌పై సాయిప‌ల్ల‌వి కామెంట్స్‌
Advertisement

Sai Pallavi | రామాయ‌ణ బాలీవుడ్ మూవీ అయినా ప్రాప‌ర్ తెలుగు సినిమా ఫీల్‌ను క‌లిగిస్తుంద‌ని సాయిప‌ల్ల‌వి అన్న‌ది. ఆమె హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ రామాయ‌ణ న‌వంబ‌ర్ 5న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ర‌ణ‌బీర్‌క‌పూర్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీలో య‌శ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్నారు. రామాయ‌ణ గాథ ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిందీతో పాటు తెలుగులోనూ రామాయ‌ణ రిలీజ్ కాబోతుంది. రామాయ‌ణ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

మూడేళ్ల జర్నీ

ఈ వేడుక‌లో సాయిప‌ల్ల‌వి మాట్లాడుతూ ‘"రామాయణ’ మూడేళ్ల జర్నీ అయినప్పటికీ, మా డైరెక్టర్, నిర్మాత పదేళ్ల క్రితం నుంచే ఈ ప్రయాణంలో ఉన్నారు. బాలీవుడ్‌లో తెర‌కెక్కించినా... ఆడియెన్స్‌కు ఒక ప్రాపర్ తెలుగు సినిమాలాగే అనుభూతిని క‌లిగిస్తుంది. నేను కూడా రామాయణం చూసి పెరిగాను. ఈ సినిమాలో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కనెక్ట్ అవుతారు. దిల్ రాజు తో ‘ఫిదా’ సినిమా నుంచి జర్నీ ఉంది. ఆయన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రకుల్ శూర్పణఖ పాత్రను అద్భుతంగా చేశారు" అని అన్న‌ది.

ప్రోటోకాల్స్....

"బాలీవుడ్‌లో సినిమా అన‌గానే తొలుత భ‌య‌ప‌డ్డాను. ఇక్క‌డి ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయో...డైలాగ్స్ క‌రెక్ట్‌గా చెప్ప‌గ‌ల‌నా? సెట్స్‌లో వాతావ‌ర‌ణం ఏ విధంగా అనే భ‌యంతోనే రామాయ‌ణ షూటింగ్‌లో అడుగుపెట్టాను. ర‌ణ‌బీర్‌క‌పూర్ నాలోని భ‌యాల‌న్నీ పోగోట్టారు. ఆయనతో కలిసి పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆయన చాలా కూల్‌గా ఉంటారు. రామాయ‌ణ షూటింగ్‌ నాకు ఒక మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్. అలాగే యశ్ విజన్ ఎప్పుడూ పెద్దగా ఉంటుంది. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉన్న యాక్టర్ ఆయన.సీతమ్మ పాత్రను చూసినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక దివ్యత్వం కలగాలి. అదే నా కోరిక. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" సాయిప‌ల్ల‌వి చెప్పింది.

రామాయ‌ణ మూవీలో సీత పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి క‌నిపించ‌బోతుంది. ర‌ణ‌బీర్‌క‌పూర్ రాముడిగా న‌టిస్తోన్న ఈ మూవీలో య‌శ్ రావ‌ణాసురుడి పాత్ర పోషిస్తున్నారు.

 

Advertisement
Advertisement