Rukmini Vasanth | వెండితెరపైకి దిగ్గజ తెలుగు సింగర్ బయోపిక్ – హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ
యాభై వేలకుపైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న దిగ్గజ గాయని పి. సుశీల జీవితం వెండితెరపైకి రాబోతుంది. ఈ బయోపిక్‌లో సుశీల పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటించబోతున్నది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ జీవితకథను నిర్మించబోతున్నట్లు సమాచారం.
Entertainment | Published On Oct 19, 2026, 5.35 pm IST
Rukmini Vasanth టాలీవుడ్‌లో మళ్లీ బయోపిక్‌ల ట్రెండ్ ఊపందుకుంది. ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా రూపొందుతోన్న పాన్ ఇండియన్ మూవీ ఇటీవలే లాంఛ్ అయ్యింది. కర్ణాటక సింగర్ పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతుంది. తాజాగా దక్షిణాదిలో మరో బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నేపథ్య గాయని...
తెలుగు దిగ్గజ నేపథ్య గాయని సుశీల జీవితం సినిమాగా వెండితెరపైకి రాబోతుంది. తెలుగు, తమిళంతో పాటు పదకొండు భాషల్లో కలిపి యాభై వేలకుపైగా పాటలు పాడారు పి సుశీల. ఒక్క తెలుగులోనే 12వేల సాంగ్స్‌ను పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగు కుటుంబంలో పుట్టి తమిళం, మలయాళం, కన్నడంతో పాటు అనేక భాషల్లో టాప్ సింగర్‌గా పేరుతెచ్చుకున్నారు. ఐదు సార్లు నేషనల్ అవార్డులతో పాటు పద్మభూషణ్‌తో పాటు అనేక పురస్కారాలు దక్కించుకున్నారు.
రుక్మిణి వసంత్...
సుశీల జీవితంలోని ఒడిదుడుకులు, సాధించిన ఘనతలతో తెలుగు, తమిళ భాషల్లో ఓ బయోపిక్ రాబోతుంది. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించబోతుంది. సుశీల బయోపిక్ కోసం రుక్మిణి వసంత్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు సమాచారం
నిర్మాతగా...
సుశీల బయోపిక్‌కు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. గానకోకిలగా పేరుతెచ్చుకున్న ఈ సింగర్ కుటుంబంతో రెహమాన్‌కు చక్కటి అనుబంధముంది. రెహమాన్ తండ్రి సంగీతం అందించిన సినిమాల్లో సుశీల పాటలు పాడారు. తన ఫేవరేట్ సింగర్ కూడా సుశీలనే పలుమార్లు రెహమాన్ కూడా చెప్పారు. సుశీల కోడలు సంధ్యా జయకృష్ణన్‌ను సింగర్‌గా రెహమాన్ పరిచయం చేశారు.
దర్శకుడు ఎవరంటే..
ఆ అనుబంధంతోనే సుశీల బయోపిక్‌ను నిర్మించడానికి రెహమాన్ ముందుకొచ్చినట్లు సమాచారం. వైఎమ్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఈ జీవిత కథకు దర్శకుడు ఎవరన్నది త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో డ్రాగన్ సినిమా చేస్తోంది రుక్మిణి వసంత్. ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా రష్మిక బతుకమ్మ సంబురం – ఫొటోలు చూశారా
అక్టోబర్ 19, 2026

Telugu OTT | ఓటీటీలోకి తెలుగు టీనేజ్ బోల్డ్ లవ్‌స్టోరీ – ఇంటర్‌లోనే ప్రేమలో పడితే!
అక్టోబర్ 19, 2026

Riteish Deshmukh | తెలుగు సినిమాలో జెనీలియా భర్త – రామ్ కోసం విలన్‌గా మారిన బాలీవుడ్ హీరో
అక్టోబర్ 19, 2026
తాజావార్తలు
- ●Bathukamma | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
- ●Sanjay Singh on Tiger Shroff Firing | గుజరాత్ జైలు నుంచే టైగర్ ష్రాఫ్‌పై దాడికి స్కెచ్
- ●Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస.. మృతదేహాలతో సీఎం బంగ్లాకు
- ●Nuclear Power Sector | అణు విద్యుత్ రంగంలో భారీ అవకాశాలు.. ఈ రెండు షేర్లపై ఓ లుక్కేయండి..
- ●Uttam Kumar Reddy | జాతీయ సమైక్య పోరాటంలో రాహుల్ వెంటే ఉందాం
- ●Telangana | ఎల్ నినోపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

Bathukamma | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

Sanjay Singh on Tiger Shroff Firing | గుజరాత్ జైలు నుంచే టైగర్ ష్రాఫ్‌పై దాడికి స్కెచ్

Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస.. మృతదేహాలతో సీఎం బంగ్లాకు

Nuclear Power Sector | అణు విద్యుత్ రంగంలో భారీ అవకాశాలు.. ఈ రెండు షేర్లపై ఓ లుక్కేయండి..



