Sai Pallavi | టైమ్ వచ్చినప్పుడు నేనే చెబుతా – పెళ్లిపై సాయిపల్లవి రియాక్షన్
త్వరలోనే సాయిపల్లవి పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సౌత్ ఇండస్ట్రీలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆరెంజ్‌డ్ మ్యారేజీ చేసుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఈ రూమర్లపై సాయిపల్లవి రియాక్ట్ అయ్యింది. పెళ్లికి ఇంకా టైమ్ ఉందని అన్నది.
Entertainment | Published On Mar 28, 2026, 1.10 pm IST
Sai Pallavi | ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్‌కు పెళ్లి అడ్డంకిగా ఉండేది. పెళ్లి చేసుకుంటే సినిమాలకు గుడ్‌బై చెప్పినట్లే అని భావించేవారు. పెళ్లి అయిన హీరోయిన్లతో సినిమాలు చేసేందుకు దర్శకులతో పాటు హీరోలు వెనకడుగువేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అలియాభట్, రష్మిక మందన్న, దీపికా పదుకొనేతో పాటు పలువురు హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా సినిమాలతో దూసుకుపోతున్నారు. నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోన్నారు. వారి బాటలోనే సాయిపల్లవి అడుగులు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిదా బ్యూటీ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. కుటుంబసభ్యులు ఆమె కోసం ఓ సంబంధాన్ని కుదుర్చారట. ఈ అరెంజ్‌డ్ మ్యారేజీకి సాయిపల్లవి ఓకే చెప్పినట్లు దక్షిణాది ఇండస్ట్రీలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్సయ్యిందని అంటున్నారు.
టైమ్ రాలేదు...
ఈ పెళ్లి రూమర్లపై ఇటీవల ఓ వేడుకలో సాయిపల్లవి రియాక్ట్ అయ్యింది. ఈవార్తలు ఎలా వచ్చాయో తనకు తెలియదని అన్నది. పెళ్లికి తొందరేం లేదని తెలిపింది. "ప్రస్తుతానికైతే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. అందుకు ఇంకా టైమ్ ఉంది. వివాహానికి ఏజ్‌తో సంబంధం లేదు. 33 ఏళ్లు అంటూ కొందరు నా వయసును టార్గెట్ చేస్తున్నారు. ఏజ్ పెరిగిపోతుందనే ఆందోళన, భయం నాకు లేవు. సింగిల్‌గానే ఉన్నా. సినిమాలు చేస్తూ ఆనందంగా ఉన్నా. ఒకేవేళ పెళ్లి కుదిరితే నేనే ఆ గుడ్‌న్యూస్ అందరికి చెబుతా" అంటూ పేర్కొన్నది. సాయిపల్లవి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
బాలీవుడ్‌లోకి...
ఈ ఏడాదే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది సాయిపల్లవి. ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఎక్ దిన్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీ మే 1న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఏక్‌దిన్‌తో పాటు మైథలాజికల్ మూవీ రామాయణలో సీత పాత్రలో సాయిపల్లవి కనిపించబోతున్నది. రణభీర్‌కపూర్ హీరోగా దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా రామాయణ మూవీ రూపొందుతోంది.
తమిళంలో ఇటీవలే మణిరత్నంతో ఓ సినిమాకు సాయిపల్లవి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రభాస్క్ కల్కి 2లో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



