త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | బాలీవుడ్ కోసం రూల్ బ్రేక్ …సాయిప‌ల్ల‌విని ట్రోల్ చేస్తున్న టాలీవుడ్ ఫ్యాన్స్‌

తొలినాళ్ల‌ నుంచి రీమేక్ సినిమాల‌కు దూరంగా ఉంటోంది సాయిప‌ల్ల‌వి. రీమేక్ సినిమాలు కావ‌డంతోనే భోళాశంక‌ర్‌, భీమ్లానాయ‌క్‌తో పాటు తెలుగులో ప‌లు సినిమాల‌ను రిజెక్ట్ చేసింది. రీమేక్ సినిమాలు చేయ‌కూడ‌ద‌నే రూల్‌ను బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం సాయిప‌ల్ల‌వి ప‌క్క‌న‌పెట్ట‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తోన్నాయి.

N

Entertainment | Published On Apr 10, 2026, 5.09 pm IST

Sai Pallavi  | బాలీవుడ్ కోసం రూల్ బ్రేక్ …సాయిప‌ల్ల‌విని ట్రోల్ చేస్తున్న టాలీవుడ్ ఫ్యాన్స్‌
Advertisement

Sai Pallavi |  కెరీర్ ఆరంభం నుంచి సినిమాల ఎంపిక‌లో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తోంది సాయిప‌ల్ల‌వి. ఈ బ్యూటీ అంగీక‌రించిందంటే ఆ సినిమా హిట్టే అనే న‌మ్మ‌కం ఆడియెన్స్‌లో క‌నిపిస్తోంది. సినిమాల‌ విష‌యంలో కొన్ని లిమిటేష‌న్స్‌ను తొలి మూవీ నుంచి పాటిస్తోంది సాయిప‌ల్ల‌వి. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటోంది. అంతే కాకుండా రీమేక్ సినిమాలు చేయ‌కూడ‌ద‌ని రూల్ కూడా పెట్టుకుంది. గ‌తంలో చిరంజీవి భోళాశంక‌ర్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లానాయ‌క్‌తో మ‌రికొన్ని భారీ బ‌డ్జెట్ సినిమాల్లో హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌విని తీసుకోవాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు. కానీ రీమేక్ సినిమాలు కావ‌డంతో ఆ ఆఫ‌ర్ల‌ను నిర్మొహ‌మాటంగా రిజెక్ట్ చేసింది.

కొత్త‌ద‌నం ఉండ‌దు...

ఒక‌రు చేసిన పాత్ర‌ల‌ను మ‌ళ్లీ చేయ‌డం త‌న‌కు న‌చ్చ‌ద‌ని ప‌లుమార్లు రీమేక్ సినిమాల‌పై సాయిప‌ల్ల‌వి కామెంట్స్ చేసింది. రీమేక్ సినిమాల్లో న‌ట‌న ప‌రంగా మ‌రొక‌రిని అనుక‌రించ‌డం త‌ప్ప కొత్త‌గా చేసేందుకు ఏం ఉండ‌ద‌ని అన్న‌ది. అందుకే తాను రీమేక్ సినిమాల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

బాలీవుడ్ కోసం రూల్ బ్రేక్‌

రీమేక్ క‌థ‌లు అంటూ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు ప‌లువురు హీరోల‌కు హ్యాండిచ్చిన సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ కోసం త‌న రూల్‌ను ప‌క్క‌న‌పెట్టింది. ఏక్ దిన్ మూవీతో హిందీలోకి తొలి అడుగు వేయ‌బోతుంది సాయిప‌ల్ల‌వి. ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా మే 1న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఆ సినిమాను ఆమిర్‌ఖాన్ స్వ‌యంగా నిర్మిస్తున్నారు.

స్ట్రెయిట్ మూవీ ....

కాగా ఏక్ దిన్ స్ట్రెయిట్ మూవీ కాదు. థాయ్‌లాండ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన వ‌న్‌డే ఆధారంగా తెర‌కెక్కుతోంది. ప‌ద‌కొండేళ్ల సినీ ప్ర‌యాణంలో సాయిప‌ల్ల‌వి చేస్తోన్న ఫ‌స్ట్ రీమేక్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. బాలీవుడ్ ఆఫ‌ర్ కావ‌డంతో రీమేక్ అని తెలిసి కూడా సాయిప‌ల్ల‌వి ఈ సినిమాను అంగీక‌రించిందంటూ తెలుగు మూవీ ల‌వ‌ర్స్‌ విమ‌ర్శిస్తున్నారు. ద‌క్షిణాదికి ఓ రూల్‌...బాలీవుడ్‌కు మ‌రో రూలా.... అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

మ‌తిమ‌రుపుతో....

కాగా ఏక్ దిన్ మూవీలో మ‌తిమ‌రుపుతో బాధ‌ప‌డే యువ‌తిగా సాయిప‌ల్ల‌వి క‌నిపించ‌బోతుంది. ముందు రోజు ఏం జ‌రిగిందో మ‌ర‌చిపోతూ ప్ర‌తి రోజును కొత్త‌గా ప్రారంభించే అమ్మాయితో ఓ యువ‌కుడు ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడు? వారి జ‌ర్నీ ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌నే అంశాల‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

రామాయ‌ణ‌...

ప్ర‌స్తుతం ఏక్‌దిన్‌తో పాటు బాలీవుడ్‌లో రామాయ‌ణ సినిమా చేస్తోంది సాయిప‌ల్ల‌వి. ఈ పౌరాణిక సినిమాలో సీత పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ర‌ణ‌భీర్ క‌పూర్ హీరోగా దాదాపు నాలుగు వేల కోట్ల‌తో రెండు పార్ట్‌లుగా రామాయ‌ణ రూపొందుతోంది. తొలి పార్ట్ ఈ ఏడాది దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

Advertisement
Advertisement