Sai Pallavi | ట్రైలర్‌లోనే కథ మొత్తం చెప్పేశారుగా – సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీలో ట్విస్ట్ ఇదే!
ఏక్ దిన్ మూవీతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది సాయిపల్లవి. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ మే 1న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా కొత్త ట్రైలర్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో సినిమా కథ మొత్తం చెప్పేయడం ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Apr 16, 2026, 3.39 pm IST
Sai Pallavi | ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్లకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. రష్మిక మందన్న, శ్రీలీల, నయనతారతో పాటు పలువురు హీరోయిన్లు హిందీలో సినిమాలు చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో సాయిపల్లవి కూడా ఉంది. ఏక్ దిన్ మూవీతో బాలీవుడ్‌లో తొలి అడుగు వేయబోతుంది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆమిర్‌ఖాన్ స్వయంగా నిర్మిస్తోన్నారు. మే 1న పాన్ ఇండియన్ లెవెల్‌లో హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
కొత్త ట్రైలర్...
ఇటీవల ఏక్‌దిన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సాయిపల్లవి డబ్బింగ్‌తో పాటు ట్రైలర్ క్వాలిటీపై దారుణంగా విమర్శలొచ్చాయి. దాంతో మేకర్స్ మరో కొత్త ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో ఎక్ దిన్ కథ మొత్తం చెప్పేశారు.
ట్రాన్సింగ్ గ్లోబల్ అమ్నేషియా...
ఈ సినిమాలో మీరా అనే పాత్రలో సాయిపల్లవి కనిపించబోతున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. మీరా పనిచేసే ఆఫీస్‌లోనే ఐటీ ఎంప్లాయ్‌గా జునైద్ ఖాన్ వర్క్ చేస్తుంటాడు. ఒకే ఫ్లోర్‌లో పనిచేస్తున్నా జునైద్ ఎవరో మీరాకు తెలియదు. కానీ జునైద్ మాత్రం ఆమెను ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. అప్పటికే టీమ్ లీడర్‌తో మీరా ప్రేమలో ఉంటుంది. ఆఫీస్ వర్క్ విషయంలో టార్గెట్స్ రీచ్ కావడంతో కంపెనీ వారిని ట్రిప్ కోసం జపాన్ పంపిస్తుంది. అక్కడ మీరాకు యాక్సిడెంట్ అవుతుంది.ఆ ప్రమాదం కారణంగా ట్రాన్సింగ్ గ్లోబల్ అమ్నేషియా అనే సమస్యతో మీరా బాధపడుతుంది. తన గతం మొత్తం మర్చిపోతుంది. కానీ ఒక్క రోజే. ఆ ఒక్క రోజులోనే ఆమెకు బాయ్‌ఫ్రెండ్‌గా జునైద్ అబద్దమాడి దగ్గరైనట్లుగా ఈ ట్రైలర్‌లో చూపించారు. ఈ ఒక్కరోజులో వారిద్దరు కలిసి సాగించే జర్నీ చుట్టూ ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది.
కొత్త ట్రైలర్‌కు హిందీలో సాయిపల్లవి సొంతంగా డబ్బింగ్ చెప్పింది. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. కెరీర్‌లో సాయిపల్లవి చేస్తోన్న ఫస్ట్ రీమేక్ మూవీ ఇది కావడం గమనార్హం.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






