త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | 25 కోట్ల బ‌డ్జెట్ – ఐదు కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ

సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఏక్ దిన్ ఓటీటీలోకి వ‌స్తోంది. జూలై 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ హిందీ సినిమాలో ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా న‌టించాడు.

N

Entertainment | Published On Jul 12, 2026, 5.24 pm IST

Sai Pallavi | 25 కోట్ల బ‌డ్జెట్ – ఐదు కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ
Advertisement

Sai Pallavi |  ఏక్ దిన్ మూవీతో నాచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ నిర్మించ‌గా...అత‌డి కొడుకు జునైద్ ఖాన్ హీరోగా న‌టించాడు. భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఏక్ దిన్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దాదాపు ఇర‌వై ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో అతి క‌ష్టంగా ఐదు కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

అమెజాన్ ప్రైమ్‌లో...

థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఏక్ దిన్ ఓటీటీలోకి వ‌స్తోంది. జూలై 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లోఈ సినిమా రిలీజ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయిన ఏక్‌దిన్‌కు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

రీమేక్‌...

థాయ్ మూవీ వ‌న్ డే ఆధారంగా ఈ బాలీవుడ్ మూవీ రూపొందింది. ఈ సినిమాకు సునీల్ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఏక్ దిన్‌ కాన్సెప్ట్, డైరెక్ట‌ర్ టేకింగ్‌తో పాటు జునైద్ ఖాన్ యాక్టింగ్‌, సాయిప‌ల్ల‌వి డ‌బ్బింగ్ అస్స‌లు బాగాలేవంటూ విమ‌ర్శ‌లొచ్చాయి. ఔట్‌డేటెడ్ క‌థ‌తో రూపొందించార‌ని, ఈ ఏడాది బాలీవుడ్‌లో వ‌చ్చిన చెత్త సినిమాల్లో ఒక‌టంటూ ట్రోల్ చేశారు.

ఒక్క రోజు ప్రేమ‌క‌థ‌...

మీరా ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌. కంపెనీ బాస్ న‌కుల్‌తో ప్రేమ‌లో ఉంటుంది. అదే ఆఫీస్‌లో ప‌నిచేసే ఐటీ ఎంప్లాయ్ దినేష్ ....మీరాను ప్రేమిస్తుంటాడు. కానీ త‌న ప్రేమ‌ను ఆమెకు వ్య‌క్తం చేయ‌డానికి భ‌య‌ప‌డుతుంటాడు. కంపెనీ ఎంప్లాయ్స్ అంద‌రూ క‌లిసి జ‌పాన్ ట్రిప్‌కు వెళ‌తారు. అక్క‌డ జ‌రిగిన ఓ ప్ర‌మాదంలో మీరా ట్రాన్సియెంట్ అమ్నీషియా బారిన ప‌డుతుంది. ఈ స‌మ‌స్య కార‌ణంగా ఒక్క రోజు మీరా త‌న గ‌తం మొత్తాన్ని మ‌ర్చిపోతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఆ ఒక్క రోజు మీరా బాయ్‌ఫ్రెండ్‌న‌ని అబ‌ద్దం చెప్పి ఆమెకు ద‌గ్గ‌ర‌వుతాడు దినేష్‌. ఆ త‌ర్వాత ఏమైంది? ఆ ఒక్క రోజు మీరా, దినేష్ ఎలా గ‌డిపారు? దినేష్ ప్రేమ‌ను మీరా అర్థం చేసుకుందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

రామాయ‌ణ‌...

ఏక్ దిన్ త‌ర్వాత హిందీలో రామాయ‌ణ సినిమా చేస్తోంది సాయిప‌ల్ల‌వి. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీలో ర‌ణ‌భీర్‌క‌పూర్ హీరోగా న‌టిస్తోండ‌గా...కేజీఎఫ్ హీరో య‌శ్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. రెండు పార్ట్‌లుగా రామాయ‌ణ రూపొందుతోంది. తొలి భాగం ఈ ఏడాది దీపావ‌ళికి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి సీత‌గా న‌టిస్తోంది.

 

 

Advertisement
Advertisement