త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Dhanshika | ఓటీటీలోకి హీరో విశాల్‌కు కాబోయే భార్య త‌మిళ మూవీ

క‌బాలి ఫేమ్ సాయిధ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ యోగిదా ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. మార్చి 13న ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. యోగిదా ప్ర‌మోష‌న్స్‌లోనే త‌మిళ హీరో విశాల్‌ను పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు సాయిధ‌న్సిక ప్ర‌క‌టించింది.

N

Entertainment | Published On Mar 10, 2026, 6.53 pm IST

Sai Dhanshika | ఓటీటీలోకి హీరో విశాల్‌కు కాబోయే భార్య త‌మిళ మూవీ
Advertisement

Sai Dhanshika |  క‌బాలి ఫేమ్‌ సాయిధ‌న్సిక ఎంగేజ్‌మెంట్ గ‌త ఏడాది కోలీవుడ్ హీరో విశాల్‌తో జ‌రిగింది. ఈ జంట త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా సాయిధ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ త‌మిళ మూవీ యోగిదా ఈ వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మార్చి 13 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఆహా ప్లాట్‌ఫామ్ ఓ పోస్ట‌ర్ ద్వారా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

డిజాస్ట‌ర్‌...

లేడీ ఓరియెంటెడ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన యోగిదా సినిమాకు గౌత‌మ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో సాయి ధ‌న్సిక‌తో పాటు క‌బీర్‌సింగ్ దుహాన్‌, షాయాజీ షిండే కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావ‌డంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

ప్ర‌మోష‌న్స్‌లోనే...

కాగా యోగిదా మూవీ ప్ర‌మోష‌న్స్‌లోనే తాము ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా విశాల్‌, సాయిధ‌న్సిక ప్ర‌క‌టించారు. ఆగ‌స్ట్ 29న 2025లో పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల పెళ్లి వాయిదాప‌డింది.
యోగిదా సినిమాలో సాయి ధ‌న్సిక ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించింది. యోగేశ్వ‌రి అలియాస్ యోగి నిజాయితీప‌రురాలైన పోలీస్ అధికారిణి. కోయంబ‌త్తూర్ నుంచి చెన్నైకి ట్రాన్స్‌ఫ‌ర్ మీద వ‌స్తుంది. జ‌వ‌ర‌హ‌ర్ బాబు అనే క్రిమిన‌ల్‌తో తొలిరోజే యోగికి వైరం మొద‌ల‌వుతుంది. జ‌వ‌హ‌ర్ బాబు అక్ర‌మాల‌కు యోగి ఎలా చెక్ పెట్టింది? ఈ క్ర‌మంలో ఆమెకు ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? అస‌లు కోయంబ‌త్తూర్ నుంచి యోగి చెన్నైకి ఎందుకు వ‌చ్చింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.
త‌మిళంలో ర‌జ‌నీకాంత్ క‌బాలి మూవీతో ఫేమ‌స్ అయ్యింది సాయిధ‌న్సిక‌. ఈ సినిమాలో సూప‌ర్ స్టార్ కూతురి పాత్ర‌లో న‌టించింది. త‌మిళంలో ప‌లు సినిమాలు చేసిన సాయిధ‌న్సిక తెలుగులో అంతిమ‌తీర్పు, షికారులో హీరోయిన్‌గా క‌నిపించింది.

Advertisement
Advertisement