Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు – ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?
భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో సాంగ్‌లో నటించబోతుంది. అల్లు అర్జున్ రాకా మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్‌తో కలిసి స్టెప్పులు వేయబోతుంది. మూడున్నర నిమిషాల పాట కోసం భాగ్యశ్రీ బోర్సే భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.
Entertainment | Published On Aug 7, 2026, 2.16 pm IST
Bhagyashri Borse | స్టార్ హీరోయిన్లు ఇండిపెండెంట్ వీడియో సాంగ్స్‌లో కనిపించే ట్రెండ్ బాలీవుడ్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడీ ట్రెండ్ తమిళంలో కూడా మొదలైంది. శృతి హాసన్, కయదు లోహర్, ప్రీతి ముకుందన్‌తో పాటు చాలా మంది హీరోయిన్లు మ్యూజిక్ వీడియో సాంగ్స్‌లో కనిపించారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో భాగ్యశ్రీ బోర్సే కూడా చేరింది. రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో స్టెప్పులు వేసేందుకు రెడీ అయ్యింది.
అల్లు అర్జున్ రాకా...
ప్రస్తుతం దక్షిణాదిలో మ్యూజిక్ డైరెక్టర్‌గా సాయి అభ్యంకర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ రాకాతో పాటు సూర్య 48వ సినిమా, ధనుష్ ఓమ్‌తో పాటు మరో ఐదు సినిమాలకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అనిరుధ్, ఏఆర్ రెహమాన్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. సాయి అభ్యంకర్ కెరీర్ ఇండిపెండెంట్ సాంగ్స్‌తోనే మొదలైంది. అతడు మ్యూజిక్ అందిస్తూ స్వయంగా పాడిన కత్తి సెరా, పవళ మళ్లి, ఆశ కూడ పాటలు యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్‌ను రాబట్టాయి. పవళ మళ్లి పాటలో కయదు లోహర్, ఆశకూడలో ప్రీతి ముకుందన్...సాయి అభ్యంకర్‌తో కలిసి కనిపించారు.
కోటి రూపాయలు...
మరో ఇండిపెండెంట్ సాంగ్‌తో త్వరలో తమిళ మ్యూజిక్ లవర్స్‌ను పలకరించబోతున్నాడు సాయి అభ్యంకర్. ఈ పాటలో అతడితో కలిసి భాగ్యశ్రీ బోర్సే నటించబోతున్నట్లు సమాచారం. లెనిన్ హీరోయిన్ నటిస్తోన్న ఫస్ట్ వీడియో సాంగ్ కూడా ఇదే కావడం గమనార్హం. త్వరలోనే చెన్నైలో సాయి అభ్యంకర్, భాగ్యశ్రీ బోర్సేలపై ఈ ఇండిపెండెంట్ సాంగ్‌ను షూట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మూడున్నర నిమిషాల నిడివితో సాగే ఈ పాట కోసం భాగ్యశ్రీ బోర్సే కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌తో సియోన్ సినిమా చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఇటీవల రిలీజైన తెలుగు మూవీ లెనిన్‌తో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను అందుకుంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ యాక్షన్ లవ్‌స్టోరీ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లను దక్కించుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhagyashri Borse | పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే – బ్లడీ రోమియోతో రొమాన్స్
ఆగస్టు 4, 2026

Lenin OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి అఖిల్ అక్కినేని వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ
ఆగస్టు 1, 2026

Bhagyashri Borse | నేను హీరోయిన్ కావడం మా అమ్మకు ఇష్టం లేదు – భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్
జులై 30, 2026
తాజావార్తలు
- ●Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది.. బావ, బామ్మర్దులిద్దరూ దౌర్భాగ్యులే
- ●Gen Z | జెన్‌జీపై అంత శ్రద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్
- ●Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఆ మగాడి టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!
- ●JSW MG | ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1100 కిలోమీటర్ల మైలేజ్.. భారత్‌లో ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..
- ●Joginapally Santhosh Kumar | వెంకటాపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. 2000 వేల మొక్కలు నాటిన సంతోష్‌కుమార్
- ●Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క

Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది.. బావ, బామ్మర్దులిద్దరూ దౌర్భాగ్యులే

Gen Z | జెన్‌జీపై అంత శ్రద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్

Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఆ మగాడి టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!

JSW MG | ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1100 కిలోమీటర్ల మైలేజ్.. భారత్‌లో ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..



