త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ – పెళ్లి కొడుకు కాపురానికి అత్తారింటికి వ‌స్తే|

అచ్చ తెలుగు హీరోయిన్ సాన్వీ మేఘన న‌టించిన త‌మిళ మూవీ ప్యార్ ప్రేమ క‌ళ్యాణం నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఆగ‌స్ట్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాకు ఎల‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

N

Entertainment | Published On Jul 27, 2026, 7.56 pm IST

Tamil OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ – పెళ్లి కొడుకు కాపురానికి అత్తారింటికి వ‌స్తే|
Advertisement

Tamil OTT | అచ్చ తెలుగు అమ్మాయి సాన్వీ మేఘ‌న కోలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. ఈ బ్యూటీ హీరోయిన్‌గా న‌టించిన కుడుంబ‌స్తాన్ గ‌త ఏడాది త‌మిళంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ప్ర‌స్తుతం మూన్‌వాక్‌తో పాటు కోలీవుడ్‌లో మ‌రికొన్ని సినిమాలు చేస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌...

తాజాగా సాన్వీ మేఘ‌న హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ ప్యార్ ప్రేమ క‌ళ్యాణం మూవీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఆగ‌స్ట్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. త‌మిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు ఎల‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో అత‌డే హీరోగా క‌నిపించ‌బోతున్నాడు.

ప‌ది పాట‌ల‌తో...

ప్యార్ ప్రేమ క‌ళ్యాణం సినిమాకు యువ‌న్ శంక‌ర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. మొత్తం ప‌ది పాట‌ల‌తో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ సినిమాను రూపొందించిన‌ట్లు స‌మాచారం. రాధికా శ‌ర‌త్‌కుమార్‌, యోగిబాబు, ఎంఎస్ భాస్క‌ర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్‌...

ప్యార్ ప్రేమ క‌ళ్యాణం మూవీ టీజ‌ర్‌ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. రొమాంటిక్ ఫ‌న్ అంశాల‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగింది.
పావి (సాన్వీ మేఘనా) ఫేమ‌స్ సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్‌. పెళ్ళి తర్వాత పుట్టింటిని వ‌దిలిపెట్టి ఆడ‌పిల్ల అత్తారింటికి వెళ్లాల్సిన ప‌నిలేద‌ని వాదిస్తుంటుంది. పావికి సోష‌ల్ మీడియాలో ఓ యువ‌కుడితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. ఇద్ద‌రూ పెళ్లిచేసుకుంటారు. పావి భ‌ర్త అత్తింటికి వ‌స్తాడు. అక్క‌డే క ఆపురం పెట్టాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఆ త‌ర్వాత ఎదురైన ప‌రిణామాలు, ఇబ్బందుల‌తో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు మేక‌ర్స్ టీజ‌ర్‌లో చూపించారు.

తెలుగులో...

తెలుగులో బిలాల్‌పూర్ పోలీస్ స్టేష‌న్‌తో సాన్వీ మేఘ‌న హీరోయిన్‌గా మారింది. ఆ త‌ర్వాత పుష్ప‌క‌విమానం, ప్రేమ విమానం, టుక్ టుక్‌తో పాటు క‌థానాయిక‌గా మారికొన్ని సినిమాలు చేసింది. సైరా న‌ర‌సింహారెడ్డి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్‌లో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించింది. తెలుగులో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాక‌పోవ‌డంతో త‌మిళ బాట ప‌ట్టింది.

 

Advertisement
Advertisement