Rukmini Vasanth | రుక్మిణి వసంత్ డీప్ ఫేక్ బికినీ వీడియో – ముగ్గురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ బికినీలో కనిపించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అది ఒరిజినల్ కాదని, ఏఐ సహాయంతో మార్ఫింగ్ చేశారంటూ రుక్మిణి వసంత్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో ముగ్గురిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు.
Entertainment | Published On Jun 20, 2026, 4.05 pm IST
Rukmini Vasanth | కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ బికినీ ధరించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. స్విమ్మింగ్‌పూల్‌లో బికినీ ధరించి ఫొటోలకు ఫోజులిస్తూ ఈ వీడియోలో కాంతార ఛాప్టర్ వన్ హీరోయిన్ కనిపించడం దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మొదటి సినిమా నుంచి అందాల ప్రదర్శన విషయంలో లిమిట్స్‌లోనే ఉంటూ వచ్చిన రుక్మిణి వసంత్ సడెన్‌గా బికినీలో కనిపించడంపై జోరుగానే చర్చ జరిగింది. చివరకు ఈ బికినీ వీడియోపై రుక్మిణి వసంత్ క్లారిటీ ఇచ్చింది.
ఒరిజినల్ కాదు...
ఆ వీడియో ఒరిజినల్ కాదని, ఏఐ సహాయంతో మార్ఫింగ్ చేశారంటూ రుక్మిణి వసంత్ చెప్పింది. తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేందుకు సోషల్ మీడియాలో కావాలనే నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అసభ్యకర వీడియోలు, పోస్ట్‌లు పెడుతూ తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ కంప్లైంట్‌లో పేర్కొన్నది.
ముగ్గురి అరెస్ట్...
రుక్మిణి వసంత్ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కర్ణాటకకే చెందిన రవికుమార్, చంద్రకాంత్, రంజిత్ ఈ అసభ్యకర మార్ఫింగ్ వీడియోలను క్రియేట్ చేశారని గుర్తించారు. ఐటీ యాక్ట్ కింద ఈ ముగ్గురిపై కేసును నమోదు చేశారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంపై కర్ణాటక సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేధింపులపై కఠిన శిక్షలు ఉండాలని అంటున్నారు.
డ్రాగన్ మూవీ...
కాగా ప్రస్తుతం రుక్మిణి వసంత్ తెలుగులో ఎన్టీఆర్‌తో డ్రాగన్ మూవీ చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాని నిర్మాతగా తెరకెక్కుతోన్న ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- ●Roof Collapses At Temple | ఆలయంలో కూలిన పైకప్పు.. పలువురు మృతి..!
- ●Priyanka Chopra | ఏంజెలినా జోలీ సినిమాలో విలన్గా వారణాసి హీరోయిన్ - హాలీవుడ్లో క్రేజీ ఛాన్స్
- ●Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. డెలివరీలు షురూ.. ధర ఎంతంటే..?
- ●Consumer Court | ఎనిమిదేళ్లు వర్క్షాప్లోనే కారు.. రూ.11లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించిన వినియోగదారుల కమిషన్..
- ●Balmoori Venkat | తేజస్వీ సూర్యను తెలంగాణకు రానివ్వం.. వస్తే మా ఆవేశం చూపిస్తం

Droupadi Murmu | భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతినే కోరుకుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Roof Collapses At Temple | ఆలయంలో కూలిన పైకప్పు.. పలువురు మృతి..!

Priyanka Chopra | ఏంజెలినా జోలీ సినిమాలో విలన్గా వారణాసి హీరోయిన్ - హాలీవుడ్లో క్రేజీ ఛాన్స్

Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. డెలివరీలు షురూ.. ధర ఎంతంటే..?






