Rukmini Vasanth | బికినీ ఫొటోలపై రుక్మిణి వసంత్ ఫైర్ – షేర్ చేయద్దంటూ వార్నింగ్
రుక్మిణి వసంత్ బికినీ ధరించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్మిమ్మింగ్ పూల్‌లో బికినీలో ఫొటోలకు ఫోజులిస్తూ రుక్మిణి కనిపించింది. ఈ వైరల్ వీడియోపై కాంతార ఛాప్టర్ వన్ హీరోయిన్ రియాక్ట్ అయ్యింది. అది ఏఐ సాయంతో సృష్టించిన ఫేక్ వీడియో అని, ఆ వీడియోను షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది.
Entertainment | Published On May 23, 2026, 2.47 pm IST
Rukmini Vasanth | ఏఐ వచ్చిన తర్వాత హీరోయిన్ల కష్టాలు రెట్టింపు అయ్యాయి. కథానాయికల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్నారు. వీటిపై హీరోయిన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. తాజాగా ఈ మార్ఫింగ్ ఫొటోల బారిన కాంతార ఛాప్టర్ వన్ హీరోయిన్ రుక్మిణి వసంత్ పడింది. రుక్మిణి వసంత్ బికినీ ధరించి స్మిమ్మింగ్‌పూల్‌లో ఫొటో షూట్ చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై రుక్మిణి వసంత్ క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోలో కనిపిస్తోంది తాను కాదని, ఏఐ సహాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అన్నది. ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను సృష్టించడం, సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేయడం బాధ్యతారహితమైన చర్యగా తాను భావిస్తున్నట్లు రుక్మిణి వసంత్ పేర్కొన్నది. మరొకరి ప్రైవసీకి భంగం కలిగించడం సరికాదని చెప్పింది.
సైబర్ క్రైమ్ పోలీసులకు...
"ఈ నకిలీ వీడియో వ్యవహారాన్ని తేలిగ్గా వదిలిపెట్టదలుచుకోలేదు. ఈ నకిలీ వీడియోలు, ఫోటోలను సృష్టించిన వారిపై, వాటిని షేర్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నా. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటా. ఇలాంటి ఫేక్ కంటెంట్‌ను ఎవరూ క్రియేట్ చేయద్దు...షేర్ చేయద్దు" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రుక్మిణి వసంత్ ఓ పోస్ట్ పెట్టింది. నెటిజన్లు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.
కాంతార ఛాప్టర్ వన్‌తో...
కాంతార ఛాప్టర్ వన్ మూవీతో పెద్ద విజయాన్ని అందుకుంది రుక్మిణి వసంత్. ఈ సినిమాలో పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో అదరగొట్టింది. ఈ సక్సెస్‌తో దక్షిణాదిలో రుక్మిణి వసంత్ ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. యశ్ టాక్సిక్‌లో ఓ హీరోయిన్‌గా కనిపించబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kayadu Lohar | సోషల్ మీడియాకు బ్రేక్ - నాని ప్యారడైజ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్
- ●Amit Shah | ఉగ్రవాదంపై మౌనం.. యూపీఏ పాలనపై అమిత్ షా విమర్శలు
- ●VC Sajjanar | మొహర్రం సందర్భంగా బీబీ కా అలవాలో ఏనుగు 'శ్రీదేవి' ట్రయల్ రన్ షురూ!
- ●Minister Seethakka | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ
- ●Ponnam Prabhakar | ఇబ్బందులుండొద్దు.. పనితీరు మంచిగుండాలే
- ●Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్‌రావు

Kayadu Lohar | సోషల్ మీడియాకు బ్రేక్ - నాని ప్యారడైజ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Amit Shah | ఉగ్రవాదంపై మౌనం.. యూపీఏ పాలనపై అమిత్ షా విమర్శలు

VC Sajjanar | మొహర్రం సందర్భంగా బీబీ కా అలవాలో ఏనుగు 'శ్రీదేవి' ట్రయల్ రన్ షురూ!

Minister Seethakka | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ






