Rashmika Mandanna | లెజెండరీ సింగర్ బయోపిక్‌లో నేషనల్ క్రష్?
ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా రష్మిక మందన్న కొనసాగుతోంది. పలు పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ తాజాగా ఓ బయోపిక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దిగ్గజ సింగర్ పాత్రలో కనిపించబోతున్నదట. ఆ సింగర్ ఎవరంటే?
Entertainment | Published On Jun 8, 2026, 3.06 pm IST
Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తెలుగులో ఫస్ట్ టైమ్ ఓ బయోపిక్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. లెజెండరీ సింగర్ పాత్రలో కనిపించనున్నట్లు చెబుతోన్నారు. దిగ్గజ కర్ణాటక సంగీత కళాకారిణి ఎం.ఎస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా తెలుగులో ఓ మూవీ రాబోతుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సామాన్యురాలిగా జీవితాన్ని మొదలుపెట్టి దేశ గర్వించే సంగీత కళాకారిణిగా సుబ్బులక్ష్మి సాగించిన ప్రయాణం? సినిమాల్లోకి ఎంట్రీ? పెళ్లైనా వ్యక్తితో ప్రేమాయణంతో పాటు పలు అంశాలను ఎమోషనల్‌గా ఆవిష్కరిస్తూ ఈ సినిమా సాగనుందట.
సాయిపల్లవి....
కాగా ఈ బయోపిక్‌లో హీరోయిన్‌గా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కనిపించనుందని అంటున్నారు. తొలుత సుబ్బులక్ష్మి జీవిత కథలో హీరోయిన్‌గా సాయిపల్లవి పేరు ప్రముఖంగా వినిపించింది. డేట్స్ ఇష్యూ కారణంగా నాచురల్ బ్యూటీ ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత రుక్మిణి వసంత్‌ను తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. చివరకు సుబ్బులక్ష్మి రోల్ కోసం నేషనల్ క్రష్‌ను ఫైనల్ చేశారట.
రష్మికపై లుక్ టెస్ట్
పాన్ ఇండియన్ లెవెల్‌లో రష్మికకు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ప్లస్సవుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ బయోపిక్‌కు సంబంధించి రష్మికపై లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. అచ్చం సుబ్బులక్ష్మిని పోలినట్లుగా రష్మిక కనిపిస్తోన్న ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. లుక్ టెస్ట్‌కు సంబంధించిన స్టిల్ ఇదని నెటిజన్లు అంటున్నారు. సుబ్బులక్ష్మి బయోపిక్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బన్నీవాసు నిర్మించబోతున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
తెలుగు...హిందీలో...
ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ మూవీస్‌తో రష్మిక ఫుల్ బిజీగా ఉంది. భర్త విజయ్ దేవరకొండతో రణబాలి పేరుతో ఓ హిస్టారికల్ మూవీ చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రష్మిక చేస్తోన్న మైసా మూవీ షూటింగ్ దశలో ఉంది.హిందీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన కాక్ టెయిల్ 2 జూన్ 19న థియేటర్లలోకి రాబోతుంది.
ప్రముఖ గాయని #MSSubbalakshmi గా నటించెందుకు #RashmikaMandanna ఎంపికయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ బయోపిక్ కోసం రష్మీక పై లుక్ టెస్ట్ కూడా ఇటీవల నిర్వహించినట్లు తెలుస్తోంది. #gowtamtinnanuri ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఈ పాత్రకు #Keerthysuresh #Rukminivasanth ల… pic.twitter.com/b2dmRSYm48— SZN (@Suzenbabu) June 7, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | పెద్ది సక్సెస్ మీట్‌కు ముహూర్తం ఫిక్స్ – అందరి ఫోకస్ అచ్చియమ్మపైనే …
జూన్ 8, 2026

Priyanka Mohan | గ్లామర్ డోస్ పెంచిన ఓజీ హీరోయిన్
జూన్ 7, 2026

Nithya Menen | టాలీవుడ్ ఒక్కటే కాదు .. అన్ని ఇండస్ట్రీలు ఇంతే – జాన్వీ కపూర్ పెద్ది వివాదంపై నిత్యా మీనన్ కామెంట్స్
జూన్ 7, 2026
తాజావార్తలు
- ●Y Satish Reddy | తెలంగాణ హిట్లర్ రేవంత్ రెడ్డి : వై సతీష్ రెడ్డి
- ●Infinix Smart 20 | పవర్ఫుల్ డిస్ప్లే, భారీ బ్యాటరీతో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్.. ధర ఎంతంటే..?
- ●Indian Railway | రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో భారీ మార్పులు.. ఆగస్టు నుంచే అమలు..!
- ●Opposition leaders | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. SIRపై సీజేఐకి లేఖ.. ఇండీ కూటమి కీలక నిర్ణయాలు
- ●BRS Party | 1950 రాష్ట్రపతి ఉత్తర్వును సవరించాలి.. బాలకృష్ణన్ కమిషన్‌ను కలవనున్న బీఆర్ఎస్ బృందం
- ●Stock Markets | యుద్ధం ఆందోళనలతో.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Y Satish Reddy | తెలంగాణ హిట్లర్ రేవంత్ రెడ్డి : వై సతీష్ రెడ్డి

Infinix Smart 20 | పవర్ఫుల్ డిస్ప్లే, భారీ బ్యాటరీతో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్.. ధర ఎంతంటే..?

Indian Railway | రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో భారీ మార్పులు.. ఆగస్టు నుంచే అమలు..!

Opposition leaders | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. SIRపై సీజేఐకి లేఖ.. ఇండీ కూటమి కీలక నిర్ణయాలు



