త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sree Vishnu Movie | శ్రీవిష్ణు సరసన ‘సర్దార్‌ 2’ భామ.. సితార బ్యానర్‌లో మూవీ..!

Sree Vishnu Movie | యంగ్‌ హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’తో పాటు సంక్రాంతి 2027 విడుదలకు సిద్ధమవుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీవిష్ణు.. తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఓ కొత్త చిత్రం మొదలైంది.

P

Entertainment | Published On Sep 7, 2026, 2.51 pm IST

Sree Vishnu Movie | శ్రీవిష్ణు సరసన ‘సర్దార్‌ 2’ భామ.. సితార బ్యానర్‌లో మూవీ..!
Advertisement

Sree Vishnu Movie | యంగ్‌ హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’తో పాటు సంక్రాంతి 2027 విడుదలకు సిద్ధమవుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీవిష్ణు.. తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఓ కొత్త చిత్రం మొదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌ 39గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అనగనగా’ ఫేమ్‌ సన్నీ సంజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. ‘సర్దార్‌ 2’లో హీరోయిన్‌గా నటించిన ఆషికా రంగనాథ్‌.. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా నటించనున్నారు.

ప్రేమికురాలిగా..

ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన ఆషికా రంగనాథ్‌ కథానాయికగా కనిపించనున్నారు. శ్రీవిష్ణు ప్రేమికురాలిగా ఆమె పాత్ర సాగనుంది. ఈ జోడీ తెరపై కొత్తగా కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఆషికా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ‘సర్దార్‌ 2’ ద్వారా పరిచయమయ్యారు. ఇప్పుడు శ్రీవిష్ణుతో కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్‌ చేసింది. నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారి జీవితాల్లోని భావోద్వేగ సంఘర్షణలు, ప్రేమ, సంబంధాలు తదితర అంశాలను గ్లింప్స్‌లో చూపించారు. యువత జీవితాలను ప్రతిబింబించేలా సినిమా రూపొందుతున్నట్లు గ్లింప్స్‌ ద్వారా స్పష్టమైంది. సహజమైన కథనం, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సన్నీ సంజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీవిష్ణు ఇప్పటివరకు ఎంచుకున్న కథలకు భిన్నమైన టచ్‌తో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. గ్లింప్స్‌కు వచ్చిన స్పందన సినిమాపై అంచనాలను పెంచింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో..

నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హారికా సూర్యదేవర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీ సంజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. శ్రీవిష్ణు, ఆషికా రంగనాథ్‌తో పాటు ఇతర నటీనటులు కూడా సినిమా ప్రారంభంలో పాల్గొన్నారు. సినిమా టైటిల్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్‌ రానున్నాయి. శ్రీవిష్ణు–ఆషికా రంగనాథ్‌ జోడీ, నేటి యువత జీవితాల నేపథ్యంలో సాగే కథనం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

కన్నడలో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆషికా రంగనాథ్‌.. వరుస అవకాశాలతో దక్షిణాదిలో తన మార్క్‌ చూపిస్తున్నది. ‘క్రేజీ బాయ్‌’, ‘రాజు కన్నడ మీడియం’, ‘రాంబో 2’, ‘మధగజ’, ‘అవతార పురుష’ వంటి కన్నడ చిత్రాల్లో నటించిన ఆమె.. ‘అమిగోస్‌’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘నా సామిరంగ’లో వ‌రాలు పాత్రలో మెప్పించింది. కార్తీ నటించిన ‘సర్దార్‌ 2’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న ఆషికాకు తాజాగా మరో లక్కీ ఛాన్స్‌ దక్కినట్లయ్యింది. దీంతో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంటున్న ఆషికా రంగనాథ్‌.. టాలీవుడ్‌లోనూ తన హవా కొనసాగిస్తున్నారనే చెప్పాలి.

Advertisement
Advertisement