Sandeep Vanga | సందీప్ వంగా నయా రోల్ – రొమాంచకం నుంచి పొయెటిక్ సాంగ్ రిలీజ్
అగ్ర దర్శకుడు సందీప్ వంగా ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు మూవీ రోమాంచకం నుంచి ఫస్ట్ సింగిల్‌ను గురువారం రిలీజ్ చేశారు. రాధా రమణ అంటూ సాగిన ఈ పాటలో నాయకానాయికల కెమిస్ట్రీ, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
Entertainment | Published On Jul 23, 2026, 4.54 pm IST
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫస్ట్ టైమ్ తెలుగులో ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న చిన్న సినిమా రోమాంచకం. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్నఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్ వంగా సోదరుడు ప్రణయ్ వంగా నిర్మిస్తున్నారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ వీడియో గ్లింప్స్‌తో ఈ చిన్న సినిమా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
రాధారమణ....
గురువారం ఈ సినిమా నుంచి రాధా రమణ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. వాసుకి వైభవ్ సంగీతం అందిస్తూ ఈ పాటను స్వయంగా ఆలపించారు. హీరోహీరోయిన్ల రిలేషన్‌ను కవితాత్మకంగా చూపిస్తూ బ్యూటీఫుల్‌గా ఈ రొమాంటిక్ సాంగ్ సాగింది. విజువల్స్, సుమంత్ ప్రభాస్ - అనంతిక కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తోన్నాయి.
లవ్ కామెడీ, ఎమోషన్స్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు.
రిలీజ్ డేట్...
రోమాంచకం మూవీని సెప్టెంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మూడో సినిమా....
ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు సందీప్ వంగా. ఓ వైపు ప్రభాస్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంటూనే ఈ చిన్న సినిమాపై కూడా ఫోకస్ పెడుతోన్నాడు. మేము ఫేమస్ మూవీతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ప్రభాస్ ఇటీవలే గోదారి గట్టుపైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అతడు హీరోగా నటిస్తోన్న మూడో సినిమా ఇది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | ఎట్టకేలకు శ్రీలీలకు తెలుగులో ఓ ఛాన్స్ – రెమ్యూనరేషన్ తగ్గించిన బ్యూటీ
జులై 23, 2026

Rashmi Gautam | రష్మికి బిగ్ షాక్ – శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఔట్ – ఫ్యాన్స్ ఫైర్
జులై 21, 2026

Rashmika Mandanna | నేషనల్ క్రష్ కోసం సెంటిమెంట్ బ్రేక్ – రామ్‌చరణ్, సుకుమార్ సినిమాపై కొత్త బజ్
జులై 21, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- ●KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..
- ●CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు
- ●Rakul Preet Singh | సినిమా బడ్జెట్ 1100 కోట్లు - రకుల్ రెమ్యూనరేషన్ కోటి
- ●Special Traffic Bureau | ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. తెరపైకి ప్రత్యేక బ్యూరో

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..

CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు



