Spider-Man Brand New Day | టామ్ హాలండ్ స్పైడర్‌మ్యాన్ సంచలనం.. 4 రోజుల్లోనే ది ఒడిస్సీ రికార్డుకు చెక్..
Spider-Man Brand New Day | టామ్ హాలండ్ నటించిన స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ చిత్ర వసూళ్లను ఈ సినిమా అధిగమించింది.
Entertainment | Published On Aug 3, 2026, 11.45 am IST
Spider-Man Brand New Day | టామ్ హాలండ్ నటించిన స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ చిత్ర వసూళ్లను ఈ సినిమా అధిగమించింది. భారత్ లో ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, దేశంలో అత్యంత భారీ ఓపెనింగ్ అందుకున్న హాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ట్రేడ్ ట్రాకర్ శాక్‌నిల్క్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాలుగో రోజు ముగిసే సమయానికి స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే భారత్‌లో రూ.306.37 కోట్ల గ్రాస్, రూ.256.20 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. ఆదివారం ఒక్కరోజే 18,051 షోల ద్వారా రూ.76 కోట్ల నెట్ వసూలు చేయగా, తొలి వీకెండ్ కలెక్షన్లు రూ.250 కోట్ల మార్క్‌ను దాటాయి.
తొలి వీకెండ్‌లో రూ.8,100 కోట్ల వసూళ్లు..
ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. బాక్స్ ఆఫీస్ మోజో అంచనాల ప్రకారం.. తొలి వీకెండ్‌లోనే ఈ చిత్రం సుమారు 927 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.8,100 కోట్లు) వసూలు చేసింది. దీంతో సినిమా చరిత్రలో అత్యధిక గ్లోబల్ ఓపెనింగ్ సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో అవెంజర్స్: ఎండ్‌గేమ్ 1.22 బిలియన్ డాలర్ల ఓపెనింగ్‌తో తొలి స్థానంలో కొనసాగుతుండగా, స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే రెండో స్థానానికి చేరుకుంది. అలాగే అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్ తొలి వీకెండ్‌లో సాధించిన 640.5 మిలియన్ డాలర్ల గ్లోబల్ ఓపెనింగ్‌ను కూడా ఈ చిత్రం అధిగమించింది.
సంబంధిత వార్తలు

Hollywood OTT | ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ది ఒడిస్సీ – ట్విస్ట్ ఏంటంటే?
ఆగస్టు 11, 2026

The Odyssey Review | ది ఒడిస్సీ రివ్యూ – కథను కాకుండా ఎలివేషన్లను నమ్ముకున్న క్రిస్టోఫర్ నోలన్ – హాలీవుడ్ మూవీ ఎలా ఉందంటే?
జులై 18, 2026

Christopher Nolan | తొలిసారిగా భారత్‌కు క్రిస్టోఫర్ నోలన్.. వచ్చే నెలలో ముంబయిలో ‘ది ఒడిస్సీ’ ప్రీమియర్
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం

Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!



