Riya Shibu | సర్వంమాయ డెలులు బ్యాక్‌గ్రౌండ్ ఇదే – ప్రొడ్యూసర్‌గా కెరీర్ స్టార్ట్ – ఆర్ఆర్ఆర్ మూవీతో లింకేంటి?
సర్వం మాయ సినిమాతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది రియా శిబు. ఈ సినిమాలో డెలులు పాత్రలో ఆమె నాచురల్ యాక్టింగ్, క్యూట్‌నెస్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. హీరోయిన్‌గా కంటే ముందు నిర్మాతగా రియా శిబు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే...
Entertainment | Published On Feb 17, 2026, 5.36 pm IST
Riya Shibu | గత ఏడాది డిసెంబర్‌లో మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన సర్వంమాయ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 150 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో నివీన్ పాల్, రియా శిబు, ప్రీతి ముకుందన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలోనే అఖిల్ సత్యన్ డైరెక్టర్‌గా మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ సర్వంమాయ అదరగొడుతోంది. ఇటీవల జియో హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ సినిమా గత రెండు వారాలుగా ట్రెండింగ్‌లో ఉంది.
డెలులు పాత్రలో...
అందమైన దయ్యంతో ప్రేమలో పడిన ఓ యువకుడి కథతో దర్శకుడు అఖిల్ సత్యన్ ఈ సినిమాను తెరకెక్కించారు. సర్వం మాయ స్టోరీ కొత్తదేమీ కాదు. కానీ నివీన్ పాల్, రియా శిబు కెమిస్ట్రీ, వారిద్దరి లవ్‌స్టోరీని డైరెక్టర్ ప్రజెంట్ చేసిన తీరుకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా రియా శిబు చేసిన డెలులు క్యారెక్టర్ యూత్ ఆడియెన్స్ క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. డెలులు పాత్రలో ఆమె క్యూట్‌నెస్, నాచురల్ స్క్రీన్‌ప్రజెన్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సర్వంమాయతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది రియా శిబు. ఈ సినిమాతో రియా శిబుకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయట. డెలులు పాత్ర కోసం తొలుత ప్రియా ముకుందన్‌ను అనుకున్నారట డైరెక్టర్. కానీ చివరలో ఆమెను కాదని రియా శిబును సెలెక్ట్ చేశారు.
ప్రొడ్యూసర్‌గా స్టార్ హీరోలతో...
సర్వంమాయతోనే హీరోయిన్‌గా ఫస్ట్ హిట్ అందుకుంది రియా శిబు. ఈ సినిమా కంటే ముందు కప్ పేరుతో ఓ మలయాళ సినిమా చేసింది. ఆ మూవీని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సర్వంమాయతో స్టార్‌గా మారింది.
యాక్టర్‌గా కంటే ముందు రియా శిబు ఓ నిర్మాత. ప్రొడ్యూసర్‌గానే ఆమె సినీ కెరీర్ ప్రారంభమైంది. హిందీ, తమిళంతో పాటు మలయాళంలో సినిమాలు చేసింది. విజయ్ సేతుపతి బాలీవుడ్ మూవీ ముంబైకర్, చియాన్ విక్రమ్ వీర ధీర శూరన్ 2 సినిమాలకు రియా శిబునే నిర్మాత. యంగ్ ఫిమేల్ ప్రొడ్యూసర్ గా రికార్డు నెలకొల్పింది.
ఆర్ఆర్ఆర్ మలయాళ నిర్మాత...
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్‌ను మలయాళంతో తన తండ్రి శిబు థామిన్స్‌తో కలిసి రియా శిబు రిలీజ్ చేసింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొన్నది. ప్రొడ్యూసర్‌గా రాని గుర్తింపు ఒక్క సర్వంమాయ సినిమాతోనే రియా శిబుకు వచ్చింది. రియా శిబు సోదరుడు హృదు హరున్ కూడా హీరోగా చాలా సినిమాలు చేశాడు,.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






