త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam | రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు క‌న్నుమూత – 12 ఏళ్ల త‌ర్వాత రీఎంట్రీ…అంత‌లోనే విషాదం..

మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. సీనియ‌ర్ సినీ న‌టుడు సంతోష్ నాయ‌ర్ మంగ‌ళ‌వారం రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశారు. సంతోష్ నాయ‌ర్ న‌టించిన చివ‌రి మూవీ భ‌ర‌త‌నాట్యం 2 ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో రిలీజైంది.

N

Entertainment | Published On May 5, 2026, 4.18 pm IST

Malayalam | రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు క‌న్నుమూత – 12 ఏళ్ల త‌ర్వాత రీఎంట్రీ…అంత‌లోనే విషాదం..
Advertisement

Malayalam |  ప్రముఖ మలయాళ సీనియ‌ర్‌ నటుడు సంతోష్ నాయర్ మంగళవారం రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశారు. కేరళలోని పతనంతిట్ట జిల్లా ఏనాథ్ వద్ద సంతోష్ నాయ‌ర్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఆయన భార్య సుభశ్రీకి గాయాల‌య్యాయి.
రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన సంతోష్ నాయ‌ర్‌ను స్థానికులు ఆసుప‌త్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో సంతోష్ నాయర్‌కు గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి మరణించినట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.

వంద‌కుపైగా సినిమాల్లో...

మ‌ల‌యాళంలో వంద‌కుపైగా సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేశారు సంతోష్ నాయ‌ర్‌. 1982లో వ‌చ్చిన ఇతు జంగ‌ళుడే క‌థ సినిమాతో మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా న‌టించాడు. ఎక్కువ‌గా విల‌న్ రోల్స్ సంతోష్ నాయ‌ర్ ఫేమ‌స్ అయ్యారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌, క‌మెడియ‌న్‌గా కూడా క‌నిపించాడు. ఇనియ క‌దా తుర‌డుమ్‌, ఇవిడే ఈ తీర‌త్తు, వ‌సంత సేన‌, కీరంతం, ఎంతే శ‌బ్దంతో పాటు ప‌లు సినిమాలు సంతోష్ నాయ‌ర్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.

రీఎంట్రీ...

2014లో రిలీజైన క‌జిన్స్ మూవీ త‌ర్వాత మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యారు సంతోష్ నాయ‌ర్‌. ప‌న్నెండేళ్ల విరామం త‌ర్వాత భర‌త‌నాట్యం 2 మోహినీయాట్టంతో రీఎంట్రీ ఇచ్చాడు సంతోష్ నాయ‌ర్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజైన ఈ మూవీ పెద్ద హిట్ట‌య్యింది. మే 8వ తేదీన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలోకి రాబోతుంది. భ‌ర‌త‌నాట్యం విజ‌యంతో మ‌ళ్లీ మ‌ల‌యాళంలో ప‌లు అవ‌కాశాలు సంతోష్ నాయ‌ర్‌ను వ‌రించాయి. ఇంత‌లోనే రోడ్డు ప్ర‌మాదంలో సంతోష్ నాయ‌ర్ క‌న్నుమూయ‌డంతో మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది.

 

Advertisement
Advertisement