త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | మెగా హీరోతో టాలీవుడ్ హీరోయిన్ బ్రేక‌ప్ – సోష‌ల్ మీడియాలో రూమ‌ర్లు

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బాట‌లోనే టాలీవుడ్ హీరోయిన్ రీతూ వ‌ర్మ అడుగులు వేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మెగా హీరోతో త‌న‌ ల‌వ్‌స్టోరీకి బ్రేక‌ప్ చెప్పిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ట్వీట్స్ , పోస్ట్‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ వార్త‌ల్లో నిజ‌మెంత అంటే?

N

Entertainment | Published On Jul 21, 2026, 3.32 pm IST

Tollywood | మెగా హీరోతో టాలీవుడ్ హీరోయిన్ బ్రేక‌ప్ – సోష‌ల్ మీడియాలో రూమ‌ర్లు
Advertisement

Tollywood |  కోలీవుడ్ హీరోతో ప్రేమాయ‌ణానికి హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గుడ్‌బై చెప్పిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అనుప‌మ బాట‌లోనే మ‌రో టాలీవుడ్ హీరోయిన్ కూడా అడుగులు వేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మూడేళ్ల ప్రేమ బంధానికి వీడ్కోలు చెప్పిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ట్వీట్స్‌, కామెంట్స్ క‌నిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు రీతూ వ‌ర్మ‌. పెళ్లిచూపులు, ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఈ బ్యూటీ ఉప్పెన హీరో వైష్ణ‌వ్‌తేజ్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా వార్త‌లొస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో జ‌రిగిన ప‌లు ఫంక్ష‌న్ల‌లో రీతూ వ‌ర్మ క‌నిపించింది.

సోష‌ల్ మీడియా పోస్ట్‌...

ఓ కొత్త ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్ట‌బోతున్నానంటూ ఇటీవ‌ల రీతూ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌ను అంద‌రి కంటే ముందు వైష్ణ‌వ్‌తేజ్ లైక్ కొట్ట‌డం అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠికి రీతూ వ‌ర్మ క్లోజ్ ఫ్రెండ్‌. ఆమె ద్వారానే రీతూ వ‌ర్మ‌, వైష్ణ‌వ్‌తేజ్ మ‌ధ్య ల‌వ్‌స్టోరీ మొద‌లైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్రేమ వార్త‌ల‌పై రీతూ వ‌ర్మ‌తో పాటు వైష్ణ‌వ్‌తేజ్ ఇప్ప‌టివ‌ర‌కు రియాక్ట్ కాలేదు.

కెరీర్ కార‌ణంగా....

కాగా పెళ్లి వ‌ర‌కు చేరుకున్న వీరి బంధానికి మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ముగింపు ప‌డిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మెగా హీరోను గ‌త కొద్ది రీతూ వ‌ర్మ దూరం పెడుతోన్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. అయితే ఈ రూమ‌ర్ల‌లో నిజం లేద‌ని స‌మాచారం. వీరి ప్రేమ బంధానికి ఎలాంటి ఆటంకాలు ఎదుర‌వ్వ‌లేద‌ని అంటున్నారు. త‌ల ల‌వ్ స్టోరీ... కెరీర్‌కు అడ్డుగా నిల‌వ‌కూడ‌ద‌నే సైలెంట్‌గా ఉంటున్న‌ట్లు స‌మాచారం.

ఉప్పెన త‌ర్వాత‌...

ముఖ్యంగా ప‌రాజ‌యాల కార‌ణంగా వైష్ణ‌వ్‌తేజ్ సినిమాల‌కు మూడేళ్లు గ్యాప్ ఇచ్చాడు. ఉప్పెన త‌ర్వాత అత‌డు చేసిన సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. 2023లో వ‌చ్చిన ఆదికేశ‌వ త‌ర్వాత కొత్త సినిమా ఏది చేయ‌లేదు. క‌థ‌లు వింటూనే ఉన్నాడు. ఇటీవ‌లే వీఐ ఆనంద్ డైరెక్ష‌న్‌లో ఓ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు రీతూ వ‌ర్మ సినీ జ‌ర్నీ కూడా ఓ స‌క్సెస్, మూడు ఫ్లాప్‌లు అన్న చందంగా సాగుతోంది. ప్ర‌స్తుతం గోపీచంద్‌తో భ‌ర‌త వ‌ర్ష సినిమా చేస్తోంది. ఈ హిస్టారిక‌ల్ మూవీకి సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 

Advertisement
Advertisement