త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ritika Nayak | మిరాయ్ బ్యూటీకి తెలుగులో మ‌రో ఛాన్స్ – ఫ్లాప్ హీరోతో రొమాన్స్‌

ప్ర‌స్తుతం కొరియ‌న్ క‌న‌క‌రాజు షూటింగ్‌తో బిజీగా ఉంది మిరాయ్ బ్యూటీ రితికా నాయ‌క్‌. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే తెలుగులో రితికా నాయ‌క్ మ‌రో ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. నితిన్‌తో ఓ రొమాంటిక్ కామెడీ సినిమా చేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

N

Entertainment | Published On Apr 24, 2026, 3.28 pm IST

Ritika Nayak | మిరాయ్ బ్యూటీకి తెలుగులో మ‌రో ఛాన్స్ – ఫ్లాప్ హీరోతో రొమాన్స్‌
Advertisement

Ritika Nayak | నితిన్ హిట్టు అనే మాట విని చాలా కాల‌మే అయ్యింది. 2020లో రిలీజైన భీష్మ తో స‌క్సెస్ అందుకున్న నితిన్ ఆ త‌ర్వాత హీరోగా ఏడు సినిమాలు చేశాడు. ఇవ‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. గ‌త ఏడాది భారీ హైప్‌తో రిలీజైన రాబిన్‌హుడ్‌తో పాటు త‌మ్ముడు సినిమాలు కూడా నితిన్‌ను గ‌ట్టెక్కించ‌లేక‌పోయాయి. ఈ డిజాస్ట‌ర్ల‌తో క‌థ‌ల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు నితిన్‌. గ‌త కొన్నాళ్లుగా అత‌డు ఒప్పుకున్న సినిమాల కంటే రిజెక్ట్ చేసిన‌వే ఎక్కువ‌గా ఉన్నాయి.

రొమాంటిక్ కామెడీ మూవీ...

రీసెంట్‌గా విక్ర‌మ్ కే కుమార్‌, వేణు ఎల్దండితో పాటు మ‌రికొంత మంది ద‌ర్శ‌కులు నితిన్‌కు క‌థ‌లు వినిపించారు. కానీ విజ‌యం కోసం ఎదురుచూస్తున్న నితిన్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ల‌ను ప‌క్క‌న‌పెట్టాడు. త‌న నెక్స్ట్ సినిమాతో ఇద్ద‌రు కొత్త ద‌ర్శ‌కుల‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడ‌ట‌. రొమాంటిక్ కామెడీ క‌థతో డెబ్యూడెంట్ డైరెక్ట‌ర్లు సోము, న‌ర్రి సిద్ధం చేసిన క‌థ నితిన్‌కు తెగ న‌చ్చిదంట‌. సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

రితికా నాయ‌క్‌...

ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ నెలాఖ‌రున నితిన్ కొత్త మూవీ లాంఛ్ కానున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. కాగా ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో నితిన్‌కు జోడీగా మిరాయ్ ఫేమ్ రితికా నాయ‌క్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు టాక్ . పాట‌లు, కొన్ని రొమాంటిక్ సీన్ల‌కు పరిమితం కాకుండా హీరోతో స‌మానంగా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్ట‌ర్ కావ‌డంతో రితికా నాయ‌క్ కూడా ఈ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

కొరియ‌న్ క‌న‌క‌రాజు...

అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మిరాయ్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకుంది. ప్ర‌స్తుతం కొరియ‌న్ క‌న‌క‌రాజు షూటింగ్‌తో బిజీగా ఉంది రితికా నాయ‌క్‌. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే తెలుగులో రితికా నాయ‌క్ మ‌రో ఛాన్స్ ద‌క్కించుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement
Advertisement