Ritika Nayak | కథ నచ్చితేనే ఓకే.. రితికా నాయక్ ప్లాన్ ఇదే
Ritika Nayak | టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న కథానాయికల జాబితాలో రితికా నాయక్ పేరు వినిపిస్తోంది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
Entertainment | Published On Aug 19, 2026, 6.35 pm IST
Ritika Nayak | టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న కథానాయికల జాబితాలో రితికా నాయక్ పేరు వినిపిస్తోంది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’తో తెలుగు తెరకు పరిచయమైన రితికా.. ‘హాయ్ నాన్న’లో తనదైన శైలిలో ఆకట్టుకున్నది. ఆ తర్వాత వచ్చిన ‘మిరాయ్’ ఆమె కెరీర్‌కు మరింత ఊపునిచ్చింది. తాజాగా వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నది. వరుస అవకాశాలు, విజయాలతో రితికా నాయక్‌కు ఇండస్ట్రీలో డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆమెను తమ సినిమాల్లో భాగం చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారని సమాచారం.
అయితే, చేతిలోకి వస్తున్న ప్రతి అవకాశానికీ ఓకే చెప్పకుండా.. కథ, పాత్రకు ప్రాధాన్యమిస్తూ రితికా ముందుకెళ్తున్నారట. తెరపై తన పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. సినిమాల సంఖ్య కంటే.. తాను పోషించే పాత్రలే ప్రేక్షకులపై ఎక్కువ కాలం ప్రభావం చూపుతాయనే ఆలోచనతో రితికా కథలను ఎంపిక చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇతర కథానాయికలతో పోలిస్తే ఆమె సినిమాల సంఖ్య కాస్త తక్కువగా కనిపించినా.. చేసిన ప్రతి చిత్రంతోనూ తన నటనను మరో కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నది. ఇదే ఆమెకు వరుస అవకాశాలు రావడానికి కారణమవుతోందని సినీ వర్గాల అభిప్రాయం. ప్రస్తుతం రితికా నాయక్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘డ్యూయెట్’లో నటిస్తోంది. నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కొత్త కథ, భిన్నమైన పాత్రతో రితికా మరోసారి అలరించనున్నారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. గత చిత్రాలతో వచ్చిన క్రేజ్‌కు ఈ సినిమా మరింత బలాన్ని చేకూరుస్తుందనే నమ్మకంతో ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే, రితికా కెరీర్ ఎంపికల విషయంలో మరో అంశంపై కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమె కథలను ఎంపిక చేసుకునే వేగాన్ని కాస్త పెంచితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, కొత్త కథానాయికల రాక, వరుసగా విడుదలవుతున్న చిత్రాల నేపథ్యంలో సినిమాల మధ్య ఎక్కువ విరామం తీసుకోవడం కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు తొందరపడి సినిమాలు చేయడం కంటే.. తన కెరీర్‌కు ఉపయోగపడే పాత్రలను ఎంచుకోవడమే మంచిదనే అభిప్రాయం కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న క్రేజ్‌ను ఎంతకాలం కొనసాగించగలరన్నది ఆమె తీసుకునే తదుపరి నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. మరి ‘డ్యూయెట్’తో పాటు రాబోయే చిత్రాలతో రితికా నాయక్ తన కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాల్సిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’.. వెంకటేశ్, కల్యాణ్‌రామ్ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఫిక్స్..
ఆగస్టు 19, 2026

Telangana Govt | సినిమా టికెట్ రేట్లు పెంచితే 20శాతం సంక్షేమానికి.. సర్కారు కీలక ఆదేశాలు..!
ఆగస్టు 19, 2026

Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్స్ కేసు.. నిధి అగర్వాల్‌ను విచారించిన ఈడీ
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●WhatsApp Cyber Fraud | వాట్సప్‌లో 'బాస్' మెసేజ్.. ఏకంగా రూ.1 కోటి కొల్లగొట్టిన కేటుగాడు, పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్
- ●Konda Susmitha | రేవంత్.. నువ్వొచ్చినా, రేవూరి తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనే
- ●January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’.. వెంకటేశ్, కల్యాణ్‌రామ్ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఫిక్స్..
- ●Illegal E-Cigarettes Hyderabad | బంజారాహిల్స్‌లో ఈ-సిగరెట్లు, నిషేధిత విదేశీ సిగరెట్ల దందా.. తక్కువ ధరకు తెచ్చి, సిటీలో భారీ రేట్లకు విక్రయం
- ●UPI | పొరపాటున వేరే వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు..
- ●CEIR | మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన అత్తాపూర్ పోలీసులు

WhatsApp Cyber Fraud | వాట్సప్‌లో 'బాస్' మెసేజ్.. ఏకంగా రూ.1 కోటి కొల్లగొట్టిన కేటుగాడు, పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్

Konda Susmitha | రేవంత్.. నువ్వొచ్చినా, రేవూరి తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనే

January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’.. వెంకటేశ్, కల్యాణ్‌రామ్ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఫిక్స్..

Illegal E-Cigarettes Hyderabad | బంజారాహిల్స్‌లో ఈ-సిగరెట్లు, నిషేధిత విదేశీ సిగరెట్ల దందా.. తక్కువ ధరకు తెచ్చి, సిటీలో భారీ రేట్లకు విక్రయం



