త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ప‌ర్సంటేజీ వివాదం – కోలీవుడ్‌లోనూ ఒక రోజు స్ట్రైక్‌

రెవెన్యూ షేరింగ్ విష‌యంలో ఎగ్జిబిగ‌ర్ల‌కు నిర్మాత‌ల‌కు నెల‌కొన్న వివాదం రోజురోజుకు తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. ఈ వివాదం కార‌ణంగా శుక్ర‌వారం రిలీజైన జెట్లీకి చాలా త‌క్కువ థియేట‌ర్లు ల‌భించాయి. తాజాగా ఈ రెవెన్యూ షేరింగ్ గొడ‌వ కోలీవుడ్‌లోనూ మొద‌లైంది.

N

Entertainment | Published On May 2, 2026, 3.07 pm IST

Tollywood | టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ప‌ర్సంటేజీ వివాదం – కోలీవుడ్‌లోనూ ఒక రోజు స్ట్రైక్‌
Advertisement

Tollywood | సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంట‌ల్ విధానం ప్లేస్‌లో ప‌ర్సంటేజీ సిస్ట‌మ్‌ను అమ‌లు చేయాలంటూ గ‌త కొన్నాళ్లుగా టాలీవుడ్ ఎగ్జిబిట‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. సినిమాల లాంగ్ ర‌న్ త‌గ్గిపోవ‌డం, నిర్వ‌హ‌ణ వ్య‌యాలు పెర‌గ‌డంతో సింగిల్ స్క్రీన్స్ చాలా వ‌ర‌కు న‌ష్టాల బారిన ప‌డుతున్నాయ‌ని ఎగ్జిబిట‌ర్లు వాదిస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ మ‌నుగ‌డ సాగించాలంటే ప‌ర్సంటేజీ విధానం అమ‌లు చేయాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని ఓ ఇర‌వై మూడు సింగిల్ స్క్రీన్స్ య‌జ‌మానులు త‌మ థియేట‌ర్ల‌లో ప‌ర్సంటేజీ విధానంలోనే సినిమాల‌ను ప్ర‌ద‌ర్శిస్తామ‌ని వెల్ల‌డించారు.

ప్రొడ్యూస‌ర్ గిల్డ్‌...

ఈ రెవెన్యూ షేరింగ్ విధానంలో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌కు టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూస‌ర్ గిల్డ్ అంగీక‌రించ‌లేదు. రెంట‌ల్ విధానంలోనే సినిమాల‌ను రిలీజ్ చేయాల‌ని అంటున్నారు. ప‌ర్సంటేజీ  సిస్టమ్ అమలులో ఉన్న థియేట‌ర్ల‌లో త‌మ సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించేది లేద‌ని అన్నారు.

జెట్లీ...

శుక్ర‌వారం రిలీజైన త‌మ జెట్లీ సినిమాను సింగిల్ స్క్రీన్స్‌తో పాటు కొన్ని మ‌ల్టీప్లెక్స్‌లోనూ రిలీజ్ కాకుండా అడ్డుకున్నారంటూ మైత్రీ డిస్ట్రిబ్యూట‌ర్ శ‌శిధ‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేశారు. సింగిల్ స్క్రీన్స్‌తో వివాదం న‌డిస్తే దానిని సాకుగా చూపించి మ‌ల్టీప్లెక్స్‌లో త‌మ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌కుండా ఆపేయ‌డం స‌రి కాదంటూ పేర్కొన్నారు. ప‌ర్సెంటేజ్ సిస్ట‌మ్‌కు అంగీక‌రించాలంటూ త‌మ‌ను ఈ విధంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ ఓ ప్ర‌క‌ట‌న‌లో శ‌శి పేర్కొన్నారు.

చ‌ర్చ‌ల‌కు రావాలి...

మైత్రీ మూవీస్ ఆరోప‌ణ‌ల‌పై ఎగ్జిబిట‌ర్లు రియాక్ట్ అయ్యారు. స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాటిని ప‌రిష్క‌రించుకుందామ‌ని చెప్ప‌డ‌మే కానీ మైత్రీ మూవీ మేక‌ర్స్ వాళ్లు చ‌ర్చ‌ల‌కు మాత్రం పిలిచిన రావ‌డం లేద‌ని అంటున్నారు. సింగిల్ స్క్రీన్స్‌లో మాత్ర‌మే కాకుండా మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రెవెన్యూ షేరింగ్‌, రెంట‌ల్ స్క్రీనింగ్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయ‌ని, అవ‌న్నీ ప‌రిష్కారం కావాలంటే మైత్రీ మూవీ మేక‌ర్స్ చ‌ర్చ‌ల‌కు రావాల‌ని కౌంట‌ర్ ఇచ్చారు.
రెవెన్యూ షేరింగ్ వివాదంపై స్టార్స్ రియాక్ట్ కాక‌పోవ‌డంపై ఎగ్జిబిగ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రెవెన్యూ షేరింగ్ వివాదం కార‌ణంగానే శుక్ర‌వారం రిలీజైన గాయ‌ప‌డ్డ సింహం, జెట్లీ సినిమాల‌కు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు చాలా త‌క్కువ‌గా ల‌భించాయి.

కోలీవుడ్‌లో...

రెవెన్యూ షేరింగ్ గొడ‌వ కోలీవుడ్‌కు చేరింది. ఇక్క‌డ థియేట‌ర్లతో స‌మ‌స్య అయితే అక్క‌డ స్టార్ హీరోలు, టెక్నీషియ‌న్ల రెమ్యూన‌రేష‌న్లపై నిర్మాత‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు. పెరిగిపోతున్న రెమ్యూన‌రేష‌న్ల కార‌ణంగా తాము న‌ష్ట‌పోతున్నామ‌ని నిర్మాత‌లు ఆరోపిస్తున్నారు. నిర్మాత న‌ష్ట‌పోతే అండ‌గా ఎవ‌రూ నిల‌వ‌డం లేద‌ని చెబుతున్నారు. ఇక నుంచి రెమ్యూన‌రేష‌న్ల విధానంలో కాకుండా రెవెన్యూ షేరింగ్ విధానంలోనే సినిమాలు చేస్తామ‌ని, అందుకు స్టార్స్ అంగీక‌రించాడ‌ని యాక్టివ్ ప్రొడ్యూస‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ స‌మ‌స్య కొలిక్కి రాక‌పోవ‌డంతో శ‌నివారం రోజు స్ట్రైక్‌కు నిర్మాత‌లు పిలుపునిచ్చారు. షూటింగ్‌లు మాత్రం య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని, కానీ రిలీజ్‌లు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను నిలిపివేస్తామ‌ని అన్నారు.

Advertisement
Advertisement