త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | పెళ్లి ఇష్టం లేద‌ని ప్రియుడితో వ‌ధువు లేచిపోతే – ఓటీటీలోకి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తెలుగు కామెడీ మూవీ

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన కామెడీ మూవీ క్రేజీ క‌ళ్యాణం ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. భ‌ద్ర‌ప్ప గాజుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో త‌రుణ్ భాస్క‌ర్, సీనియ‌ర్ న‌రేష్‌, అఖిల్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

N

Entertainment | Published On Nov 10, 2026, 9.31 am IST

OTT | పెళ్లి ఇష్టం లేద‌ని ప్రియుడితో వ‌ధువు లేచిపోతే – ఓటీటీలోకి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తెలుగు కామెడీ మూవీ
Advertisement

OTT | అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ క్రేజీ క‌ళ్యాణం మంచి సినిమాగా ప్రేక్ష‌కులను మెప్పించింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు భ‌ద్ర‌ప్ప గాజుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌రుణ్ భాస్క‌ర్‌, అఖిల్ రాజ్‌, సీనియ‌ర్ న‌రేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఆహా ఓటీటీ...

క్రేజీ క‌ళ్యాణం ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ఆహా ఓటీటీ సొంతం చేసుకుంది. త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. న‌వంబ‌ర్ 13న క్రేజీ క‌ళ్యాణం ఓటీటీలో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

తెలంగాణ నేటివిటీ...

తెలంగాణ నేటివిటీ, యాస భాష‌ల‌తో ద‌ర్శ‌కుడు భ‌ద్ర‌ప్ప ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఆడ‌పిల్ల‌ల పెళ్లి విష‌యంలో త‌ల్లిదండ్రుల ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయ‌నే మెసేజ్‌ను సినిమాలో అంత‌ర్లీనంగా చూపించారు.

బాల‌రాజు తాగుబోతు...

ప‌ర్వాతాలుది మెద‌క్ జిల్లాలోని ఓ ప‌ల్లెటూరు. పెద్ద అల్లుడు బాల‌రాజు తాగుబోతు. అత‌డి కార‌ణంగా ఊళ్లో త‌న ప‌రువు పోతుంద‌ని బాధ‌ప‌డుతుంటాడు. చిన్న కూతురు కీర్తికి ఎన్ఆర్ఐ సంబంధం తీసుకొస్తాడు. కీర్తికి పెళ్లి ఇష్టం ఉండ‌దు. బాగా చ‌దువుకొని ప్ర‌భుత్వం ఉద్యోగం సాధించాల‌ని క‌ల‌లు కంటుంది. క్లాస్‌మేట్ ఉద‌య్‌ని ప్రేమిస్తుంది. తండ్రి కుదుర్చిన సంబంధం చేసుకోవ‌డం ఇష్టం లేని కీర్తి పెళ్లి రోజు ప్రియుడితో లేచిపోతుంది. ఆ త‌ర్వాత ఏమైంది? ప‌ర్వ‌తాలుతో పాటు బాల‌రాజులో ఎలా మార్పు వ‌చ్చింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement