త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollywood | పూజా హెగ్డే బాలీవుడ్ మూవీకి లీగ‌ల్ ట్ర‌బుల్ – నిర్మాత ఆరోప‌ణ‌లు – క‌న్నీళ్లు పెట్టుకున్న డైరెక్ట‌ర్‌

హై జ‌వానీతో ఇష్క్ హోనా హై టైటిల్ వివాదంలో డైరెక్ట‌ర్ డేవిడ్ ధావ‌న్‌పై నిర్మాత వ‌షు భ‌గ్నానీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. న‌మ్మి సినిమా అప్ప‌గిస్తే త‌న‌ను న‌ష్టాల‌ను మిగిల్చారంటూ ఆరోపించారు. అనుమ‌తి లేకుండా టైటిల్ వాడ‌ట‌మే కాకుండా త‌న సినిమాను కాపీ కొట్టి సినిమా చేశార‌ని విమ‌ర్శించారు.

N

Entertainment | Published On May 23, 2026, 6.13 pm IST

Bollywood | పూజా హెగ్డే బాలీవుడ్ మూవీకి లీగ‌ల్ ట్ర‌బుల్ – నిర్మాత ఆరోప‌ణ‌లు – క‌న్నీళ్లు పెట్టుకున్న డైరెక్ట‌ర్‌
Advertisement

Bollywood | హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమా విష‌యంలో డైరెక్ట‌ర్ డేవిడ్ ధావ‌న్‌, నిర్మాత వ‌షు భ‌గ్నానీ మ‌ధ్య న‌డుస్తోన్న వివాదం అనేక మ‌లుపులు తిరుగుతోంది. డేవిడ్ ధావ‌న్‌పై వ‌షు భ‌గ్నానీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. డేవిడ్ ధావ‌న్‌కు ఉన్న డిమాండ్‌కు మించి అత‌డికి డెబ్బై కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఇచ్చాన‌ని, అయినా త‌న‌కు న‌ష్టాల‌నే మిగిల్చార‌ని అన్నారు. మ‌రోవైపు హై జ‌వానీతో ఇష్క్ హోనా హై సినిమా ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్ డేవిడ్ ధావ‌న్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈవెంట్‌లోనే క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

రిలీజ్ అవుతుందా?

హై జ‌వానీ తో ఇష్క్ హోనా హై టైటిల్ హ‌క్కులు త‌న‌కే చెందుతాయ‌ని, అనుమ‌తి లేకుండా డేవిడ్ ధావ‌న్‌తో పాటు టీ సిరీస్ సంస్థ ఈ టైటిల్‌ను వాడుకుందంటూ వ‌షు భ‌గ్నానీ కేసు పెట్టారు. టైటిల్ ఛేంజ్ చేసే వ‌ర‌కు సినిమాను రిలీజ్ చేయ‌ద్దంటూ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. తాను నిర్మించిన బీవీ నంబ‌ర్ వ‌న్ సినిమాలోని చున‌రి చున‌రి సాంగ్‌ను ప‌ర్మిష‌న్ తీసుకోకుండా హై జ‌వానీతో ఇష్క్ హోనా హై రీమిక్స్ చేశార‌ని, ఈ పాట‌లోనే చ‌ర‌ణాల‌నే సినిమా కోసం టైటిల్‌గా వాడుకున్నారంటూ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. ఈ సినిమా క‌థ కూడా బీవీ నంబ‌ర్ వ‌న్‌ను కాపీ కొట్టి తీశారంటూ ఆరోపించారు. ఈ వివాదంలో ప‌ది రోజుల క్రితం వ‌షు భ‌గ్నానీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు స్టేకు వ్య‌తిరేకంగా టీ సిరీస్‌తో పాటు డేవిడ్ ధావ‌న్ మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ లీగ‌ల్ ఇష్యూస్‌పై వ‌చ్చే వారంలో విచార‌ణ జ‌రుగ‌నుంది. కోర్టు తీర్పు టీ సిరీస్‌కు వ్య‌తిరేకంగా వ‌స్తే జూన్ 5న రిలీజ్ కావాల్సిన హై జ‌వానీ తో ఇష్క్ హైనా హై వాయిదా ప‌డ‌టం ఖాయ‌మ‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

70 కోట్లు ఇచ్చా...

మ‌రోవైపు శ‌నివారం వ‌షుభ‌గ్నానీ ఈ వివాదంపై స్పందించారు. డేవిడ్ ధావ‌న్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వ‌రుణ్ ధావ‌న్ హీరోగా డేవిడ్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన కూలీ నంబ‌ర్ వ‌న్ సినిమాకు త‌న‌కు ఇర‌వై ఏడు కోట్లు న‌ష్టం వ‌చ్చింద‌ని వ‌షు భ‌గ్నానీ అన్నారు. "డేవిడ్ ధావ‌న్‌ను న‌మ్మి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొత్తం ఆయ‌న‌కే అప్ప‌గించా. కూలీ నంబ‌ర్ వ‌న్ సినిమా కోసం అత‌డికున్న మార్కెట్ వాల్యూ, డిమాండ్‌కు మించి 70 కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఇచ్చా. న‌మ్మి సినిమాను అప్ప‌గిస్తే త‌న‌కు న‌ష్టాలు మిగిల్చారు. రిలీజ్ త‌ర్వాత క‌నీసం డేవిడ్ ధావ‌న్‌తో పాటు వ‌రుణ్ ధావ‌న్ ఒక్క కాల్ చేయ‌లేదు" అంటూ విమ‌ర్శించారు. వ‌షు భ‌గ్నానీ ఆరోప‌ణ‌ల‌తో డేవిడ్ ధావ‌న్ ఎమోష‌న‌ల్ అయ్యారు. హై జ‌వానీతో ఇష్క్ హోనా హై ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయ‌న స్టేజ్‌పైనే క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఆయ‌న్ని వ‌రుణ్ ధావ‌న్‌తో పాటు మిగిలిన టీమ్ మెంబ‌ర్స్ ఓదార్చిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

 

Advertisement

తాజావార్తలు

Advertisement