త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun | ఐకాన్ స్టార్‌ను క‌లిసిన ఆర్‌సీబీ క్రికెట‌ర్ – ఫొటోలు వైర‌ల్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఆర్‌సీబీ క్రికెట‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్ క‌లిశారు. బ‌న్నీ త‌న‌యుడు అయాన్‌కు ఆర్‌సీబీ స్పెష‌ల్ జెర్సీని వెంక‌టేష్ అయ్య‌ర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.

N

Entertainment | Published On May 23, 2026, 7.54 pm IST

Allu Arjun | ఐకాన్ స్టార్‌ను క‌లిసిన ఆర్‌సీబీ క్రికెట‌ర్ – ఫొటోలు వైర‌ల్‌
Advertisement

Allu Arjun |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టీమిండియా క్రికెట‌ర్‌, ఆర్‌సీబీ ప్లేయ‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్ క‌లిశారు. శుక్ర‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ మ‌ధ్య ఐపీఎల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ ఆడేందుకు హైద‌రాబాద్ వ‌చ్చిన వెంక‌టేష్ అయ్య‌ర్ ...అల్లు అర్జున్ ఇంటికి వ‌చ్చారు. బ‌న్నీ నివాసంలో సంద‌డి చేశారు. సినిమాల‌తో పాటు క్రికెట్ గురించి వీరిద్ద‌రు చాలా సేపు ముచ్చటించుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా అల్లు అర్జున్ త‌న‌యుడు అయాన్‌కు తాను సంత‌కం చేసిన స్పెష‌ల్ జెర్సీని వెంక‌టేష్ అయ్య‌ర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.

వైర‌ల్‌...

వెంక‌టేష్ అయ్య‌ర్ త‌న నివాసంలో సంద‌డి చేసిన ఫొటోల‌ను బ‌న్నీ అభిమానుల‌తో పంచుకున్నారు. అయాన్‌కు గిఫ్ట్ గా జెర్సీ ఇచ్చినందుకు స్పెష‌ల్ థాంక్స్ చెప్పారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

రాకా...

ప్ర‌స్తుతం రాకా మూవీతో బ‌న్నీ బిజీగా ఉన్నారు. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్‌తో స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రాకా మూవీలో దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాకా త‌ర్వాత లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్‌లో బ‌న్నీ ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

ఓడిన ఆర్‌సీబీ

కాగా స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వెంక‌టేష్ అయ్య‌ర్ 19 బాల్స్‌లో 43 ర‌న్స్ చేశాడు. అయినా ఆర్‌సీబీ ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ 255 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య‌ఛేధ‌న‌లో ఆర్‌సీబీ 20 ఓవ‌ర్ల‌లో 200 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

 

 

 

Advertisement
Advertisement