Ram Charan | రంగస్థలం కాంబో రిపీట్ – రామ్‌చరణ్, సుకుమార్ మూవీపై క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!
పెద్ది తర్వాత డైరెక్టర్ సుకుమార్‌తో సినిమా చేయబోతున్నాడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి రానుందంటే?
Entertainment | Published On Apr 30, 2026, 4.05 pm IST
Ram Charan | హీరో రామ్‌చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం టాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. కమర్షియల్ హీరో ఇమేజ్‌ను బ్రేక్ చేస్తూ రా అండ్ రస్టిక్ రోల్స్‌కు రామ్ చరణ్ న్యాయం చేయగలడని నిరూపించింది. కేవలం అరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 210 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. రంగస్థలం తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ కలిసి మరో భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నారు.
జూన్ నుంచి సెట్స్‌పైకి...
ఆర్‌సీ 17 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై క్రేజీ అప్‌డేట్ రివీలైంది. ఈ పాన్ ఇండియన్ మూవీ జూన్ నుంచి సెట్స్‌పైకి రానున్నట్లు మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ వెల్లడించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినట్లు చెప్పారు. సుకుమార్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు గాయపడ్డ సింహం ప్రమోషన్స్‌లో చెర్రీ పేర్కొన్నారు.
అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో...
అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చరణ్, సుకుమార్ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ధురంధర్ 2 ఫేమ్ శశ్వాంత్ సచ్‌దేవ్ మ్యూజిక్ అందించబోతున్నట్లు తెలిసింది.
ఇద్దరిలో ఎవరు?
సుకుమార్ మూవీ కోసం చరణ్ స్పెషల్‌గా మేకోవర్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కెరీర్‌లోనే మోస్ట్ స్టైలిష్ క్యారెక్టర్‌ను ఈ సినిమాలోనే చేయబోతున్నారట. ఆర్‌సీ 17లో చరణ్‌కు జోడీగా రుక్మిణి వసంత్, రష్మిక మందన్నలలో ఒకరు హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు హీరోయిన్ అన్నది త్వరలోనే ఫైనల్ అయ్యే అవకాశం ఉందట.ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు రామ్‌చరణ్. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
సంబంధిత వార్తలు

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026

Peddi Trailer | గుడిలో కాదు గ్రౌండ్లో దేవుడు – క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా రామ్‌చరణ్ – పెద్ది ట్రైలర్ రిలీజ్
మే 18, 2026

Chiranjeevi | ముగ్గురు కలిసి రఫ్ఫాడించేశారు – పెద్ది ట్రైలర్‌పై మెగాస్టార్ రివ్యూ – డైలాగ్ లీక్
మే 16, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



