త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RaviTeja | ర‌వితేజ “తులాభారం” – క్లాస్ డైరెక్ట‌ర్‌తో మాస్ మ‌హారాజా హార‌ర్ మూవీ

ఇరుముడి త‌ర్వాత ఓ హార‌ర్ సినిమాకు మాస్ మ‌హారాజా ర‌వితేజ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. బ్రోచేవారెవ‌రురా, స‌రిపోదా శ‌నివారం సినిమాల ఫేమ్ వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు తులాభారం అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. ఓజీ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహ‌న్ ఈ హార‌ర్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

N

Entertainment | Published On Oct 1, 2026, 1.59 pm IST

RaviTeja | ర‌వితేజ “తులాభారం” – క్లాస్ డైరెక్ట‌ర్‌తో మాస్ మ‌హారాజా హార‌ర్ మూవీ
Advertisement

RaviTeja |  ఇరుముడి స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు ర‌వితేజ‌. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ మూడు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ర‌వితేజ కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. ఇరుముడి త‌ర్వాత ఓ మ‌ల్టీస్టార‌ర్‌తో పాటు మ‌రో హార‌ర్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు ర‌వితేజ. ఈ రెండు సినిమాలు త్వ‌ర‌లో సెట్స్‌పైకి రాబోతున్నాయి.

బ్రోచేవారెవ‌రురా...

ఇందులో హార‌ర్ సినిమాకు వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బ్రోచేవారెవ‌రురా, స‌రిపోదా శ‌నివారం, మెంట‌ల్ మ‌దిలో వంటి క్లాస్ సినిమాల‌ను తెర‌కెక్కించిన వివేక్ ఆత్రేయ త‌న పంథాకు భిన్నంగా హాజ‌ర్ జాన‌ర్‌లో ఫ‌స్ట్ టైమ్ సినిమా చేయ‌బోతున్నారు. చాలా రియ‌లిస్టిక్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

ద‌స‌రాకు ...

గ‌తంలో తెలుగులో వ‌చ్చిన హార‌ర్ సినిమాల‌కు భిన్న‌మైన పాయింట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు తులాభారం అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. ద‌స‌రాకు ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.
తులాభారం సినిమాలో సినిమాలో ర‌వితేజ‌కు జోడీగా ప్రియాంక మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఓజీ త‌ర్వాత తెలుగు సినిమాల‌కు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ కోలీవుడ్ బ్యూటీ ర‌వితేజ సినిమాతో మ‌ళ్లీ క‌మ్‌బ్యాక్ ఇవ్వ‌బోతుంది.

మ‌ల్టీస్టార‌ర్ ....

ఈ హార‌ర్ మూవీతో పాటు శ్రీవిష్ణుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు ర‌వితేజ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. వీరాధివీరులంట పేరుతో రూపొంద‌నున్న‌ ఈ సినిమాకు హాసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పుల కార‌ణంగా పండుగ రేసు నుంచి ఈ మూవీ త‌ప్పుకుంది.

 

Advertisement
Advertisement