Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ – క్రైమ్ కామెడీగా ‘తులాభారం’
ఇరుముడి తర్వాత క్రైమ్ కామెడీ జానర్‌లో మాస్ మాహారాజా రవితేజ ఓ సినిమా చేస్తోన్నారు. తులాభారం పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆదివారం లాంఛ్ అయ్యింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనస్వర రాజన్, ప్రియాంక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Entertainment | Published On Oct 11, 2026, 2.22 pm IST
Ravi Teja | ఇరుముడితో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు మాస్ మాహారాజా రవితేజ. శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఇరుముడి తర్వాత రవితేజ తదుపరి సినిమా ఆదివారం అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి తులాభారం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నారు. ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తరుణ్ భాస్కర్ , జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించనున్నారు.
శ్రీవిష్ణు క్లాప్...
తులాభారం ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ లాంఛింగ్ ఈవెంట్‌లో రవితేజ, అనస్వర రాజన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీవిష్ణు క్లాప్ కొట్టారు. డైరెక్టర్లు వినాయక్, బాబీ, శివనిర్వాణ ఈ ఓపెనింగ్ వేడుకలో పాల్గొన్నారు.
క్రైమ్ మహారాజాగా...
ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో క్రైమ్ మహారాజాగా రవితేజ కనిపించబోతున్నట్లు వెల్లడించారు. కృష్ణవేణి అనే పాత్రలో ప్రియాంక మోహన్, దేవరాజ్‌గా తరుణ్ భాస్కర్, శివాజీరావుగా జేడీ చక్రవర్తి నటించనున్నట్లు పేర్కొన్నారు. క్రైమ్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ పాత్ర చిత్రణ గత సినిమాలకు భిన్నంగా చాలా డిఫరెంట్‌గా ఉండనుందని చెప్పారు.
78వ మూవీ...
తులాభారం సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తోండగా...తేజి ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో తులాభారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. రవితేజ హీరోగా నటిస్తోన్న 78వ మూవీ ఇది. ఈ సినిమాను లక్ష్మణ్, శ్రీనిరావు నిర్మిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | టాలీవుడ్‌కు జాన్వీకపూర్ గుడ్‌బై? – స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన శ్రీదేవి తనయ
అక్టోబర్ 9, 2026

Anaswara Rajan | మాస్ మహారాజా సినిమాలో మలయాళ హీరోయిన్…టాలీవుడ్లో అనస్వరకు మరో ఛాన్స్
అక్టోబర్ 6, 2026

RaviTeja | రవితేజ “తులాభారం” – క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా హారర్ మూవీ
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు
- ●Green India Challenge | ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..
- ●Gutta Sukhendar Reddy | సిస్టర్ సిటీ బంధం ఇంకింత బలపడాలే
- ●Jupally Krishna Rao | ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించాలి
- ●Supreme Court | ఢిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలను పునరుద్ధరించండి : సుప్రీంకోర్టు
- ●Ponnam Prabhakar | ఒక్క ఓటు పోలేదంటున్నవ్.. టైమిస్తే అందర్ని తోల్కొనొస్తా

Drunk and Drive Cases | పోయిన వారం 97 కొట్టేశారు.. ఈవారం 265 కేసులు బుక్ చేశారు

Green India Challenge | ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు..

Gutta Sukhendar Reddy | సిస్టర్ సిటీ బంధం ఇంకింత బలపడాలే

Jupally Krishna Rao | ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించాలి



