Priyanka | ‘ఓజీ’ తర్వాత ప్రియాంకకు జాక్‌పాట్.. రవితేజ సినిమాలో భారీ రెమ్యునరేషన్!
Priyanka | మాస్ మహారాజా రవితేజ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తులాభారం’. ఈ సినిమా టైటిల్ వీడియోను విడుదల చేసిన మేకర్స్.. తారాగణాన్ని పరిచయం చేస్తూ లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్ పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Entertainment | Published On Oct 14, 2026, 6.35 pm IST
Priyanka | మాస్ మహారాజా రవితేజ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తులాభారం’. ఈ సినిమా టైటిల్ వీడియోను విడుదల చేసిన మేకర్స్.. తారాగణాన్ని పరిచయం చేస్తూ లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్ పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీతో ఆమె కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. గతంలో పలు చిత్రాల్లో నటించిన ఆమె.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’తో మరింత గుర్తింపు పొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఆమె క్రేజ్ పెరిగినట్లు తెలుస్తోంది. అయితే, ‘ఓజీ’ తర్వాత ఆమె మరో తెలుగు సినిమాకు సంతకం చేయలేదు. కథ, పాత్రతో పాటు పారితోషికం విషయంలోనూ తన స్థాయికి తగిన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
అడిగినంత ఇచ్చేందుకు ఓకే..
ఈ క్రమంలోనే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తులాభారం’లో నటించే అవకాశం ప్రియాంకను వరించింది. ఈ సినిమాలో హీరోయిన్గా ఆమెనే తీసుకోవాలని దర్శకుడు భావించారు. దీంతో ప్రియాంక తన పారితోషికాన్ని భారీగా పెంచి అడిగినప్పటికీ.. నిర్మాతలు అందుకు అంగీకరించినట్లు టాక్. ఈ డీల్ ప్రియాంక కెరీర్లోనే అత్యధిక పారితోషికం అందుకున్న చిత్రంగా నిలవనుంది. అయితే, ఆమెకు ఎంత మొత్తం చెల్లిస్తున్నారనే విషయంపై అధికారిక సమాచారం లేదు. మరోవైపు, ఈ సినిమాకు రవితేజ పారితోషికం కూడా ఆసక్తికరంగా మారింది. ‘ఇరుముడి’ విజయంతో ఆయన మార్కెట్ పెరిగిందని, ‘తులాభారం’ కోసం ఫీజుతో పాటు సినిమా బిజినెస్‌లో వాటా కలిపి సుమారు రూ.40 కోట్ల వరకు అందుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ మొత్తంపై కూడా మేకర్స్ స్పందించలేదు. మొత్తానికి, రవితేజ పారితోషికం, ప్రియాంకకు అందనున్న భారీ రెమ్యునరేషన్.. రెండూ ‘తులాభారం’పై ఆసక్తిని పెంచుతున్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
ప్రియాంక కెరీర్..
ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నది. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. శ్రీకారం, డాక్టర్, డాన్, కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించింది. పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’తో మరింత క్రేజ్ అందుకుంది. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ప్రియాంక.. ప్రస్తుతం కథాబలం ఉన్న చిత్రాలతో పాటు తన కెరీర్‌కు మరింత ప్లస్ అయ్యే ప్రాజెక్ట్‌లపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Harish Rao | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. హరీశ్‌రావు వాహనాన్ని ఆపి విద్యార్థుల ఆవేదన
- ●Jairam Ramesh | 14 కోట్ల మంది భారతీయులు చొరబాటుదారులా? ఓటర్ల జాబితా సవరణపై అమిత్ షాకు కాంగ్రెస్ 3 సూటి ప్రశ్నలు
- ●Samakhya Global Business Summit 2026 | ఉద్యోగాలు చేయడం కాదు.. కంపెనీలు పెట్టే స్థాయికి ఎదగాలి
- ●DGCA Power Bank Ban | విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ కంపెనీ పవర్ బ్యాంక్‌పై DGCA నిషేధం
- ●Mrunal Thakur | మృణాల్ కొత్త సినిమాలకు నో చెబుతోందా..? అసలు కారణం అదేనా..?
- ●Harish Rao | పాలమూరుకు పట్టిన శని కాంగ్రెస్.. మళ్ళీ వలసలు రేవంత్ రెడ్డి వైఫల్యం

Harish Rao | మధ్యాహ్న భోజనంలో పురుగులు.. హరీశ్‌రావు వాహనాన్ని ఆపి విద్యార్థుల ఆవేదన

Jairam Ramesh | 14 కోట్ల మంది భారతీయులు చొరబాటుదారులా? ఓటర్ల జాబితా సవరణపై అమిత్ షాకు కాంగ్రెస్ 3 సూటి ప్రశ్నలు

Samakhya Global Business Summit 2026 | ఉద్యోగాలు చేయడం కాదు.. కంపెనీలు పెట్టే స్థాయికి ఎదగాలి

DGCA Power Bank Ban | విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ కంపెనీ పవర్ బ్యాంక్‌పై DGCA నిషేధం





