త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ravi Teja | కిక్ కాంబో రిపీట్ – మాస్ మ‌హారాజాతో సురేంద‌ర్ రెడ్డి సినిమా ఫిక్స్‌?

Ravi Teja | మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన కిక్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. తాజాగా ఈ కాంబో రిపీట్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Dec 16, 2025, 6.38 pm IST

Ravi Teja |  కిక్  కాంబో రిపీట్ – మాస్ మ‌హారాజాతో సురేంద‌ర్ రెడ్డి సినిమా ఫిక్స్‌?

రవితేజ, సురేందర్ రెడ్డి

Advertisement

Ravi Teja | మాస్ మ‌హారాజా ర‌వితేజ (Ravi Teja), డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ అన‌గానే తెలుగు మూవీ ల‌వ‌ర్స్‌కు కిక్ సినిమానే గుర్తొస్తుంది. యాక్ష‌న్ కామెడీ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌గా కిక్ (Kick Movie) నిలిచింది. ర‌వితేజ కామెడీ టైమింగ్‌కు తోడు సురేంద‌ర్ రెడ్డి టేకింగ్‌, వ‌క్కంతం వంశీ క‌థ కిక్ విజ‌యంలో కీల‌కంగా నిలిచాయి. ముఖ్యంగా ర‌వితేజ, బ్ర‌హ్మానందం, అలీ కాంబినేష‌న్ లో కామెడీ సీన్లు ఆడియెన్స్‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశాయి. వ‌రుస డిజాస్ట‌ర్ల‌లో ఉన్న ర‌వితేజ కెరీర్‌ను కిక్ మ‌లుపు తిప్పింది. ఈ సినిమాతో స్టార్ లీగ్‌లో అడుగుపెట్టారు. కిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో ఈ సీక్వెల్‌ను కూడా తెర‌కెక్కించారు. కిక్ 2 పేరుతో వ‌చ్చిన ఈ సీక్వెల్ (Sequel) డిజాస్ట‌ర్‌గా నిలిచింది.
దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ కిక్ కాంబో రిపీట్ కానున్న‌ట్లు స‌మాచారం. ర‌వితేజ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాకు వ‌క్కంతం వంశీ క‌థ‌ను అందించ‌బోతున్నాడట‌. ర‌వితేజ‌, సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన గ‌త సినిమాల త‌ర‌హాలోనే స్టైలిష్ యాక్ష‌న్ కామెడీగా ఈ మూవీ ఉండ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సురేంద‌ర్ రెడ్డి ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ వ్య‌వ‌హారాల‌తో బిజీగా ఉండ‌టంతో ఈ గ్యాప్‌లో ర‌వితేజ‌ను సురేంద‌ర్ రెడ్డి అప్రోచ్ అయిన‌ట్లు స‌మాచారం. ర‌వితేజ కూడా కిక్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌.
ర‌వితేజ హీరోగా న‌టించిన భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన ర‌వితేజ‌...గ్యాప్ తీసుకోకుండా శివ నిర్వాణ కొత్త మూవీ సెట్స్‌లో అడుగుపెట్టారు.
ఇవే కాకుండా మ్యాడ్ ఫేమ్ క‌ళ్యాణ్ శంక‌ర్‌తోపాటు విశ్వంభ‌ర డైరెక్ట‌ర్ వ‌శిష్ట మ‌ల్లిడితో ర‌వితేజ సినిమాలు చేయ‌నున్నారు. ఇవ‌న్నీ పూర్త‌యిన త‌ర్వాతే ర‌వితేజ‌, సురేంద‌ర్ రెడ్డి సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో ప్రారంభం కావ‌చ్చున‌ని అంటున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement