Malavika Mohanan | అప్పుడు రిజెక్ట్ – ఇప్పుడు రొమాన్స్ – మాస్ మహారాజా మల్టీస్టారర్‌లో రాజాసాబ్ హీరోయిన్
రాజాసాబ్ హీరోయిన్ మాళవికా మోహనన్ టాలీవుడ్‌లో ఓ బంపరాఫర్ అందుకున్నట్లు సమాచారం. రవితేజ, శ్రీవిష్ణు హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా మాళవికా మోహనన్ ఫిక్సైనట్లు తెలిసింది. రవితేజకు జోడీగా ఈ మలయాళ బ్యూటీ కనిపించనుందని అంటున్నారు.
Entertainment | Published On Jul 19, 2026, 4.32 pm IST
Malavika Mohanan | రాజాసాబ్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్. ప్రభాస్ సరసన అవకాశం కావడంతో ఈ హారర్ కామెడీ మూవీపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. తన కెరీర్‌కు ఓ టర్నింగ్ పాయింట్‌గా రాజాసాబ్ నిలుస్తుందంటూ ప్రమోషన్స్‌లో చెప్పింది. గత సినిమాలకు మించి అందాలను ఆరబోసింది. అయినా ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసిరాలేదు. రాజాసాబ్ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది.
మల్టీస్టారర్...
తాజాగా మాళవికా మోహనన్ తెలుగులో మరో లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. మాస్ మహారాజాతో రొమాన్స్ చేయబోతుంది. రవితేజ, శ్రీవిష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. దిల్‌రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా మాళవికా మోహనన్ ఫిక్సైనట్లు సమాచారం. ఈ మల్టీస్టారర్‌లో రవితేజకు జోడీగా ఈ మలయాళ బ్యూటీ కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
వీరాధి వీరులంట...
యాక్షన్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వీరాధివీరులంట అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రవితేజ మాస్ రోల్ చేస్తోండగా...శ్రీవిష్ణు కామెడీ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
ఖిలాడీ రిజెక్ట్...
గతంలో రవితేజ ఖిలాడీ మూవీలో మొదటగా మాళవికా మోహనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కథ విని ఓకే చెప్పిన ఈ మలయాళ సుందరి షూటింగ్ మొదలయ్యే ముందు సినిమా నుంచి తప్పుకుంది. అప్పట్లో మాళవికా మోహనన్ ఖిలాడీని రిజెక్ట్ చేయడంలో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా నుంచి వైదొలగడానికి గల కారణాలేమిటన్నది కూడా వెల్లడించలేదు. అప్పుడు రవితేజ సినిమాను రిజెక్ట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు అతడితో రొమాన్స్ చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది.
రజనీకాంత్....విజయ్....
రాజాసాబ్ కంటే ముందు దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో చాలానే సినిమాలు చేసింది మాళవికా మోహనన్. రజనీకాంత్ పేటా, విజయ్ మాస్టర్, విక్రమ్ తంగలాన్‌తో పాటు మరికొన్ని భారీ బడ్జెట్ మూవీస్‌లో హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమాల్లో మాళవికా మెహనన్ నటనకు పేరొచ్చిన సక్సెస్‌లు మాత్రం దక్కలేదు. ప్రస్తుతం కార్తి సర్దార్ 2లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతో విజయ్ సేతుపతితో పాకెట్ నావెల్ అనే మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది మాళవికా మోహనన్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే – హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ
జులై 26, 2026

Ram Charan | రామ్‌చరణ్‌కు సర్జరీ – కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ – ఆర్సీ 17 షూటింగ్ ఆలస్యం?
జులై 26, 2026
తాజావార్తలు
- ●Sreelekha Mitra | ప్రధాని మోదీపై అభ్యంతరకరమైన పోస్టర్.. బెంగాలీ నటిపై కేసు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
- ●Vakiti Srihari | పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేయొద్దు: మంత్రి వాకిటి శ్రీహరి
- ●Facebook | ఫేస్బుక్లో కొత్త వెరిఫికేషన్.. ఇక ఫేక్ ఖాతాలకు చెక్..
- ●Green India Challenge | మడ అడవుల్లో మరో 10వేల మొక్కలు.. సుందర్బన్స్కు అండగా గ్రీన్ ఇండియా చాలెంజ్
- ●Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. పతనమైన చమురు ధరలు..

Sreelekha Mitra | ప్రధాని మోదీపై అభ్యంతరకరమైన పోస్టర్.. బెంగాలీ నటిపై కేసు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Vakiti Srihari | పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేయొద్దు: మంత్రి వాకిటి శ్రీహరి

Facebook | ఫేస్బుక్లో కొత్త వెరిఫికేషన్.. ఇక ఫేక్ ఖాతాలకు చెక్..



