Nani Vs Ravi Teja | నాని వర్సెస్ రవితేజ – ప్యారడైజ్‌కు పోటీగా థియేటర్లలోకి ఇరుముడి
నాచురల్ స్టార్ నాని సినిమాకు పోటీగా మాస్ మహారాజా రవితేజ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. రవితేజ ఇరుముడి రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే రోజు నాని ప్యారడైజ్ కూడా విడుదల కాబోతోంది.
Entertainment | Published On Jun 7, 2026, 12.38 pm IST
Nani Vs Ravi Teja | నాచురల్ స్టార్ నానితో బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా రవితేజ పోటీపడబోతున్నారు. రవితేజ హీరోగా నటిస్తోన్న ఇరుముడి రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఆగస్ట్ 21న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఆదివారం ప్రకటించారు. ఇరుముడి సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైథలాజికల్ టచ్‌తో సాగే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మాస్ ఇమేజ్‌కు భిన్నంగా....
మాస్ ఇమేజ్‌కు భిన్నంగా ఇందులో రవితేజ పాత్ర సాగుతుందట. ఓ చిన్నారికి తండ్రిగా ఎమోషనల్ రోల్‌లో రవితేజ కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. ఈ సినిమా కోసం మాస్ మహారాజా అనే ట్యాగ్‌ను కూడా పక్కనపెట్టాడట. అంతే కాకుండా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ బేసిస్‌లో ఇరుముడి సినిమాను రవితేజ చేస్తోన్నట్లు సమాచారం.
ప్యారడైజ్ వస్తుందా? వాయిదానా?
రవితేజ ఇరుముడి రిలీజ్ అవుతోన్న ఆగస్ట్ 21న నాని ప్యారడైజ్ కూడా థియేటర్లలోకి రాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు అభిమానుల్లో ఆసక్తిగా మారింది. మరోవైపు నాని ప్యారడైజ్ పోస్ట్‌పోన్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ షూటింగ్ ఇప్పటివరకు 70 శాతం మాత్రమే పూర్తయ్యిందట. బ్యాలెన్స్ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయడానికి టైమ్ పట్టేలా ఉందని, అందుకే ఆగస్ట్ 21న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ ఫిక్సైనట్లు సమాచారం. ప్యారడైజ్ వాయిదా పడనుండటంతోనే ఆ డేట్‌కు రవితేజ వస్తోన్నట్లు చెబుతోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ashika Ranganath | నాచురల్ స్టార్ సరసన నా సామిరంగ బ్యూటీ….బ్లడీ రోమియోకు హీరోయిన్ దొరికిందా?
ఏప్రిల్ 26, 2026

Aya Sher | పొట్టు పొట్టు ఆకలుంది.. ఆయా షేర్ పాటతో ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం..
ఏప్రిల్ 19, 2026

Kayadu Lohar | సుబ్బలక్ష్మి వచ్చేసింది… నాని ప్యారడైజ్ నుంచి సర్ప్రైజ్ అప్డేట్
ఏప్రిల్ 11, 2026
తాజావార్తలు
- ●Dr Rahul Devraj | నిమ్స్ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియామకం
- ●STHREE RIDE | 'స్త్రీ రైడ్' కార్యక్రమం ప్రారంభం.. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం
- ●Summer Holidays | పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు
- ●Ramchandar Rao | ముందు పరిహారం ఇవ్వు.. తర్వాతే పండ్ల మార్కెట్ పెట్టు
- ●Harish Rao BRS | రేవంత్ సర్కార్ జల ద్రోహం.. 'గోదావరి'కి గండికొట్టి ఆంధ్రాకు నీళ్లా? హరీశ్ రావు ఫైర్!
- ●TRP | జూలై 5న రాజ్యాధికార సమరభేరి.. భువనగిరిలో లక్షలాది మందితో సభ: టీఆర్పీ

Dr Rahul Devraj | నిమ్స్ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియామకం

STHREE RIDE | 'స్త్రీ రైడ్' కార్యక్రమం ప్రారంభం.. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం

Summer Holidays | పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

Ramchandar Rao | ముందు పరిహారం ఇవ్వు.. తర్వాతే పండ్ల మార్కెట్ పెట్టు



