త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Irumudi OTT | ర‌వితేజ ఇరుముడి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ర‌వితేజ ఇరుముడి బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించిన ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇరుముడితో లాంగ్ గ్యాప్ త‌ర్వాత బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకున్నారు ర‌వితేజ‌. ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మాస్ మ‌హారాజా మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రానుందంటే?

N

Entertainment | Published On Aug 23, 2026, 12.56 pm IST

Irumudi OTT | ర‌వితేజ ఇరుముడి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Irumudi OTT | ఇరుముడితో ర‌వితేజ అదిరిపోయే క‌మ్‌బ్యాక్ ఇచ్చాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌కు భ‌క్తి, స‌స్పెన్స్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ ఈ సినిమాను తెర‌కెక్కించారు. మాస్ ఇమేజ్‌కు భిన్నంగా ర‌వితేజ చేసిన నిజాయితీతో కూడిన ఈ ప్ర‌య‌త్నం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది.

రెండు రోజుల్లో లాభాలు...

ర‌వితేజ గ‌త సినిమాల రిజ‌ల్ట్‌ల‌తో సంబంధం లేకుండా ఇరుముడి ప్రీ రిలీజ్ బిజినెస్ ఇర‌వై కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. ప్రీమియ‌ర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో రెండు రోజుల్లోనే ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఇరుముడి మూవీ మొద‌టి రోజు 15.30 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌గా...మౌత్‌టాక్ బాగుండ‌టంతో రెండో రోజు క‌లెక్ష‌న్స్ పెరిగాయి. 16.10 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. రెండు రోజుల్లో 31.40 కోట్ల నెట్ వ‌సూళ్ల‌తో ర‌వితేజ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన మూవీగా ఇరుముడి నిలిచింది.

నెట్‌ఫ్లిక్స్‌...

ఇరుముడి డిజిట‌ల్ రైట్స్ థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే అమ్ముడుపోయాయి. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నాలుగు వారాల్లోపే ఇరుముడి ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. సెప్టెంబ‌ర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రియా భ‌వానీ శంక‌ర్‌...

ఇరుముడిలో ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. బేబీ న‌క్ష‌త్ర‌, ర‌మేష్ ఇందిర‌, సాయికుమార్‌, స్వాసిక కీల‌క పాత్ర‌లు పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో కూతురే లోకంగా బ‌తికే స‌గ‌టు తండ్రి పాత్ర‌లో స‌హ‌జ న‌ట‌నతో ర‌వితేజ ఆక‌ట్టుకున్నారు. ప్రాణం అనుకున్న‌ కూతురు అనూహ్యంగా శవంగా క‌నిపిస్తుంది. ఆమె చావు వెనుక ఎవ‌రున్నారు? త‌న కూతురి మ‌ర‌ణంపై ఆ తండ్రి ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడ‌నే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది. ఆడ‌పిల్ల‌ల‌ను భ‌యంతో పెంచ‌ద్ద‌నే మెసేజ్‌తో ఈ క‌థ‌ను రాసుకున్నాడు శివ‌నిర్వాణ‌. ఈ సినిమాకు జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు.

 

Advertisement
Advertisement