త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Irumudi OTT | అఫీషియ‌ల్ – థియేట‌ర్ల‌లో ఆడుతోండ‌గానే ఓటీటీలోకి ర‌వితేజ ఇరుముడి – నిర్మాత‌ల‌పై ఫ్యాన్స్ ఫైర్‌

ర‌వితేజ ఇరుముడి ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ అయ్యింది. సెప్టెంబ‌ర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. థియేట‌ర్ల‌లో హౌజ్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో ఆడుతోండ‌గానే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుండ‌టంపై ర‌వితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. నిర్మాత‌ల‌ను ట్రోల్ చేస్తున్నారు.

N

Entertainment | Published On Sep 13, 2026, 10.35 am IST

Irumudi OTT | అఫీషియ‌ల్ – థియేట‌ర్ల‌లో ఆడుతోండ‌గానే ఓటీటీలోకి ర‌వితేజ ఇరుముడి – నిర్మాత‌ల‌పై ఫ్యాన్స్ ఫైర్‌
Advertisement

OTT |  ర‌వితేజ ఇరుముడి థియేట‌ర్ల‌లో ఆడుతోండ‌గానే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ అయ్యాయి. సెప్టెంబ‌ర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. విడుద‌ల తేదీని వెల్ల‌డిస్తూ ఓ ఫొటోను నెట్‌ఫ్లిక్స్‌ అభిమానుల‌తో పంచుకుంది.

ప్రియా భ‌వానీ శంక‌ర్‌...

ఇరుముడి మూవీకి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ర‌వితేజకు జోడీగా ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. బేబీ న‌క్ష‌త్ర‌, సాయికుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తండ్రీకూతుళ్ల అనుబంధానికి భ‌క్తి, థ్రిల్ల‌ర్ అంశాల‌ను జోడిస్తూ ఈ సినిమాను శివ నిర్వాణ రూపొందించారు.

250 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

ఇరుముడికి ముందు ర‌వితేజ హీరోగా న‌టించిన ఆరు సినిమాలు డిజాస్ట‌ర్స్ అయ్యాయి. దాంతో ఈ మూవీపై రిలీజ్‌కు ముందు పెద్ద‌గా అంచ‌నాలు లేవు. ర‌వితేజ, బేబీ న‌క్ష‌త్ర యాక్టింగ్‌, వారిద్ద‌రి కాంబినేష‌న్‌లోని సీన్స్‌తో పాటు పాట‌లు, శివ నిర్వాణ టేకింగ్ బాగుండ‌టం, మౌత్ టాక్ కార‌ణంగా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. కేవ‌లం 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 250 కోట్ల‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ర‌వితేజ కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది.

నిర్మాత‌ల‌పై విమ‌ర్శ‌లు...

రిలీజై మూడు వారాలు దాటినా ఇప్ప‌టికీ హౌజ్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో ఇరుముడి ఆడుతోంది. థియేట‌ర్ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోండ‌గానే ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తోండ‌టంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాత‌లు చేసుకున్న ముంద‌స్తు ఒప్పందం కార‌ణంగానే నెల‌రోజుల్లోపే ఇరుముడి ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఓటీటీ రిలీజ్ డేట్‌ను అక్టోబ‌ర్ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌కు వాయిదా వేయ‌మ‌ని నిర్మాత‌లు నెట్‌ఫ్లిక్స్‌ను రిక్వెస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అందుకు అంగీక‌రించ‌లేద‌ని అంటున్నారు. సూప‌ర్ హిట్ మూవీకి అన్యాయం చేశారంటూ ర‌వితేజ ఫ్యాన్స్ నిర్మాత‌ల‌పై ఫైర్ అవుతోన్నారు.

మెసేజ్‌...

త‌న కూతురికి జ‌రిగిన అన్యాయంపై సామాన్యుడైన ఓ తండ్రి ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు? అధికారం ముసుగులో ఓ నాయ‌కుడు స్కూల్ స్టూడెంట్స్ లైఫ్‌తో ఎలాంటి ఆట‌లు ఆడుకున్నాడు అనే క‌థ‌తో ఈ మూవీ రూపొందింది. ఆడ‌పిల్ల‌ల‌ను భ‌యంతో కాకుండా ధైర్యంగా పెంచాల‌నే మెసేజ్‌ను ఈ సినిమాతో అందించాడు డైరెక్ట‌ర్‌.

 

Advertisement
Advertisement