Teaser | మగాళ్లకు రోల్ మోడల్ – రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ రిలీజ్
Teaser | రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ శుక్రవారం రిలీజైంది. రవితేజ శైలి మాస్ అంశాలేవి లేకుండా ఫన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో టీజర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Dec 19, 2025, 4.54 pm IST
Bhaktha mahashayulaku vignapthi
Teaser | రవితేజ (Ravi Teja)హీరోగా నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రవితేజకు జోడీగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.శుక్రవారం భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రవితేజ శైలి మాస్ హంగులేవి లేకుండా ఫన్ ఎలిమెంట్స్‌తో సింపుల్‌గా ఈ టీజర్ సాగింది. భార్యకు, ప్రియురాలికి మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ ఈ టీజర్‌లో కనిపించారు. రవితేజ పంచ్‌లు, ప్రాసలు టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి.
సైకాలజిస్ట్ అయిన మురళీధర్ గౌడ్‌ను కలవడానికి వెన్నెలకిషోర్‌తో రవితేజ వెళ్లే సీన్‌తోనే ఈ టీజర్ (Teaser) మొదలైంది. ఇంతకు మీ సమస్య ఏమిటో చెప్పండి అంటూ మురళీధర్ గౌడ్ అడగ్గానే...కురిసింది వాన అంటూ అంటూ ఓల్డ్ మెలోడీ సాంగ్ వినిపించడం టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.
దేరీజ్ నో ప్రాబ్లెమ్... సమస్య లేదు అంటూ మురళీధర్ గౌడ్ బదులివ్వగానే...మీకు అర్థం కావడం లేదు సార్ నా భార్యకు నేనంటే ప్రాణం అని రవితేజ బదులివ్వడం కామెడీని పంచింది. రామ్‌ను అనుమానించడమా మగాళ్లు ఎలా ఉండాలి అన్నదానికి రోల్ మోడల్ రామ్ అంటూ డింపుల్ హయతి చెప్పగానే....రవితేజ ఆషికా రంగనాథ్ నుంచి తప్పించుకోవడానికి పారిపోవడం ఆకట్టుకుంది. భార్య ఉండగానే నిజాన్ని దాచిపెట్టి మరో అమ్మాయితో లవ్‌స్టోరీ నడిపించడానికి రవితేజ పడే పాట్లతో టీజర్ ఎంటర్‌టైనింగ్‌గా సాగింది.
వెన్నెలకిషోర్, సునీల్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్‌లో కనిపించబోతున్నట్లు టీజర్‌లో చూపించారు.
రిలీజ్ డేట్...
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రిలీజ్ డేట్‌ను టీజర్‌తో పాటుగా రిలీజ్ చేశారు. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎస్ ఎల్ వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
గత కొన్నాళ్లుగా రవితేజకు సరైన విజయాలు లేవు. ఇటీవల రిలీజైన మాస్ జాతరతో కలిసి వరుసగా ఆరో డిజాస్టర్ రవితేజ ఖాతాలో పడింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సక్సెస్ రవితేజ కెరీర్‌కు కీలకంగా మారింది. ఈ సినిమాతో కథల ఎంపికలో తన స్టైల్ మార్చేశాడు.
కాగా సంక్రాంతికి రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తితో పాటు చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు, ప్రభాస్ రాజాసాబ్‌తో పాటు నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
సంబంధిత వార్తలు

Jayam Ravi | జయం రవి తండ్రి తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ – చిరంజీవి, రవితేజలతో బ్లాక్‌బస్టర్ మూవీస్
మే 16, 2026

Ashika Ranganath | నాచురల్ స్టార్ సరసన నా సామిరంగ బ్యూటీ….బ్లడీ రోమియోకు హీరోయిన్ దొరికిందా?
ఏప్రిల్ 26, 2026

Tollywood | జేడీ చక్రవర్తి మిస్ చేసుకున్న సినిమాతో సోలో హీరోగా రవితేజకు ఫస్ట్ హిట్
ఏప్రిల్ 25, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



