Jayam Ravi | బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది – నాపై చేతబడి చేయించింది – భార్యపై కోలీవుడ్ హీరో ఆరోపణలు
కోలీవుడ్ హీరో జయం రవి తన భార్య ఆర్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్తి తనను బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుందని అన్నాడు. తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టడమే కాకుండా ఆస్తులన్నీ లాగేసుకున్నారని చెప్పాడు. ఆర్తితో విడాకులు తీసుకున్న తర్వాతే తాను సినిమాలు చేస్తానని అప్పటివరకు నటించనని అన్నారు. సింగర్ కెనీషా తనకు బ్రేకప్ చెప్పిన కొద్ది గంటలు కూడా గడవక ముందే జయం రవి మీడియా ముందుకు రావడం కోలీవుడ్ నాట ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On May 16, 2026, 3.22 pm IST
Jayam Ravi | కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వ్యవహారం కోలీవుడ్ నాట ఆసక్తికరంగా మారింది. భార్య ఆర్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు జయం రవి. చనిపోతానని బెదిరించి తనను బ్లాక్‌మెయిల్ చేసి ఆర్తి పెళ్లి చేసుకుందని జయం రవి అన్నారు. పిల్లలను కూడా కలవకుండా చేసి తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తుందని చెప్పారు. 2024లో భార్య ఆర్తి నుంచి విడిపోతున్నట్లుగా జయం రవి ప్రకటించారు. సింగర్ కెనీషాతో ప్రేమలో పడ్డ జయం రవి ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. జయం రవితో పాటు సింగర్ కెనీషాపై దారుణంగా విమర్శలు వచ్చాయి. ఈ ట్రోల్స్ నేపథ్యంలో జయం రవికి బ్రేకప్ చెబుతున్నట్లు సింగర్ కెనీషా శుక్రవారం ప్రకటించింది. చెన్నైతో పాటు సంగీతాన్ని కూడా వదిలిపెడుతున్నట్లు వెల్లడించింది. కెనీషా బ్రేకప్ చెప్పిన కొద్ది గంటల కూడా కాకముందే సింగర్ జయం రవి మీడియా ముందుకు వచ్చారు. వ్యక్తిగత జీవితంలో తనకు ఎదురైన కష్టాలను వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు. మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్య ఆర్తిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
సొంత అకౌంట్ లేదు...
"హీరోగా పెద్ద పేరున్నా ఇప్పటివరకు నాకంటూ సొంతంగా పర్సనల్ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. కేవలం ఒకే ఒక్క జాయింట్ అకౌంట్ మాత్రమే ఉండేది. ఖర్చుల కోసం అందులో నుంచి డబ్బు తీయాలన్న పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఒకవేళ అడగకుండా తీసుకుంటే 'డబ్బు ఎందుకు తీశావు?' అని నానా మాటలు అనే వారు. కష్టపడి సంపాదించిన సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ కూడా నాకు లేకుండా చేశారు. పధ్నాలుగేళ్లు లోలోపలే నరకం అనుభవించాను. బానిసలా బతికాను. ఇంట్లో నుంచి నన్ను వెళ్లగొట్టారు. నాకంటూ సొంత ఇళ్లు లేకుండా చేశారు. నా ఆస్తులన్నీ లాగేసుకున్నారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా. పిల్లల కోసమే కష్టాలన్నింటిని మౌనంగా భరించా. కానీ చివరకు వారిని చూడకుండా చేస్తున్నారు. నన్ను కలవకుండా చేయడం కోసం స్కూల్‌కు కూడా బాడీగార్డ్‌లను పెట్టి పంపిస్తున్నారు" అని జయం రవి అన్నాడు.
బ్లాక్‌మెయిల్ చేసి...
"ఆర్తిని పెళ్లి చేసుకోవద్దని నా కుటుంబసభ్యులు, సన్నిహితులు చెప్పారు. కానీ నేనే వారి మాట వినలేదు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నా. నేను పెళ్లిచేసుకోనంటే సూసైడ్ చేసుకుంటానని చేయికోసుకుంది. బ్లాక్‌మెయిల్ చేసింది. దాంతో మరో దారిలేక ఆర్తిని పెళ్లి చేసుకున్నా. మొదటిరోజు నుంచే నాకు నరకం చూపించింది. చివరకు నాపై చేతబడి కూడా చేశారు" అని జయం రవి అన్నారు.
విడాకులు పూర్తయ్యే వరకు....
"ఆర్తి నుంచి విడాకులు తీసుకున్న తర్వాతే మళ్లీ సినిమాలు చేస్తానని జయం రవి ప్రకటించారు. విడాకుల ప్రక్రియ ముగిసే వరకు కెమెరా ముందుకు రాను. సినిమాలు చేయను. ఒకవేళ నటించినా కూడా ఆ సినిమాలను విడుదల చేయను. వ్యక్తిగత జీవితంలోని సమస్యల తాలూకు ప్రభావం సినిమాలపై పడుతుంది. వాటిని చక్కదిద్దుకున్న తర్వాతే తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెడతా. ఇరవై మూడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. 95 శాతం సక్సెస్ రేటు ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నా. అయినా అవమానాలు భరించలేకపోతున్నా" అని జయం రవి పేర్కొన్నారు.
చనిపోవాలనుకున్నా...
కొన్ని పీఆర్ గ్రూప్‌లను అడ్డుపెట్టుకొని, వారికి డబ్బులు ఇచ్చి తనతో పాటు తనకు అండగా నిలిచిన కెనీషాను వేధింపులకు గురిచేస్తున్నారని, అవమానించారని జయం రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రతి రోజు నరకం అనుభవిస్తున్నా. ఒకానొక దశలో బాధ తట్టుకోలేక నా చేతిని నేనే కట్ చేసుకొని చనిపోవాలని అనుకున్నానని" అని జయం రవి ఎమోషనల్ అయ్యారు. ఓ మూడక్షరాల ఇడ్లీ నటి తన జీవితాన్ని నాశనం చేసిందని అన్నారు. ఆమె పేరు చెప్పదలచుకోలేదని పేర్కొన్నారు. తన జీవితాన్ని గురించి మాట్లాడే హక్కు ఆ నటికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయం రవి వ్యాఖ్యలు తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి.
సంబంధిత వార్తలు

Trisha | రాజకీయాల్లోకి త్రిష? – తమిళనాడులో వెలిసిన బ్యానర్లు – డీఎంకే సభలో చెన్నై క్వీన్ హవా
ఆగస్టు 3, 2026

Jayam Ravi | 40 లక్షలు అందుకే అడిగాం – దళపతి విజయ్‌ని చూసి నేర్చుకో – జయం రవిపై ఆర్తి తల్లి కామెంట్లు
ఆగస్టు 3, 2026

Vijay Trisha | విజయ్, త్రిష బ్లాక్‌బస్టర్ మూవీ 21 ఏళ్ల తర్వాత థియేటర్లలో రీ రిలీజ్ – తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే డిజాస్టర్
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan | రేవంత్ హయాంలో బూతుల అడ్డాగా గాంధీభవన్
- ●PRLIS | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి
- ●Warren Buffett | రోజూ ట్రేడింగ్ చేసేవారికి వారెన్ బఫెట్ కీలక సూచనలు
- ●BJP | జెన్ జీ దెబ్బకు.. బీజేపీ అబ్బా.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఓటమి
- ●Hero Nani | అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ - ఇప్పుడు ప్రొడ్యూసర్ - నాని, నితిన్ అలియాస్ రుక్మిణి మూవీ ఓపెనింగ్ ఫొటోలు!
- ●FSSAI Norm Violations | మద్యం ప్రియులకు బిగ్ అలెర్ట్.. మూడు కంపెనీల లిక్కర్‌పై నిషేధం..!

Dasoju Sravan | రేవంత్ హయాంలో బూతుల అడ్డాగా గాంధీభవన్

PRLIS | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి

Warren Buffett | రోజూ ట్రేడింగ్ చేసేవారికి వారెన్ బఫెట్ కీలక సూచనలు

BJP | జెన్ జీ దెబ్బకు.. బీజేపీ అబ్బా.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఓటమి



