Warren Buffett | రోజూ ట్రేడింగ్ చేసేవారికి వారెన్ బఫెట్ కీలక సూచనలు
Warren Buffett | స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ అంటే సాధారణంగా చాలా మంది రోజూ కొనుగోళ్లు, అమ్మకాలు చేయాలని భావిస్తుంటారు. కానీ ఇది సరి కాదు. ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారు వందలాది నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. కానీ కేవలం నాలుగైదు నిర్ణయాలు, అవి కూడా అత్యంత నాణ్యమైన, నమ్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి.
Warren Buffett | స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ అంటే సాధారణంగా చాలా మంది రోజూ కొనుగోళ్లు, అమ్మకాలు చేయాలని భావిస్తుంటారు. కానీ ఇది సరి కాదు. ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారు వందలాది నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. కానీ కేవలం నాలుగైదు నిర్ణయాలు, అవి కూడా అత్యంత నాణ్యమైన, నమ్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి. అవే దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తాయి. అయితే ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తూ దిగ్గజ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాత్‌వే మాజీ సీఈవో వారెన్ బఫట్ ఇన్వెస్టర్లకు ఈ సూచనలు చేశారు. ఇన్వెస్టింగ్ అంటే రోజూ కొనడం, అమ్మడం కాదని, అత్యంత నమ్మకంగా తీసుకునే చాలా స్వల్ప నిర్ణయాలే దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టిస్తాయని తెలిపారు.
ప్రతి స్టాక్ వెంట పడొద్దు..
బేస్‌బాల్ దిగ్గజం టెడ్ విలియమ్స్ రచించిన ది సైన్స్ ఆఫ్ హిట్టింగ్ అనే పుస్తకంలోని పలు విషయాలను వివరిస్తూ వారెన్ బఫెట్ పలు కీలక వివరాలను వెలలడించారు. ఆ పుస్తకాన్ని ఆయన ఉదాహరణంగా తీసుకున్నారు. దీంతో ఓ ఆసక్తికరమైన పోలికను ఆయన తెలియజేశారు. బేస్‌బాల్ లో బ్యాటర్ వైపు వచ్చే ప్రతి బంతిని ఆడాల్సి ఉంటుందని, అలా ఆడకపోతే అవుట్ అయ్యే ప్రమాదం ఉంటుందని అన్నారు. కానీ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్‌లో అలాంటి బలవంతపు కాల్డ్ స్ట్రైక్స్ ఏవీ ఉండవని, మనకు నచ్చిన కంపెనీ స్టాక్ సరైన ధరకు లభించే వరకు ఇన్వెస్టర్ ఏళ్ల తరబడి ఓర్పుతో వేచి చూడాల్సి వస్తుందని తెలిపారు. ఒక వ్యక్తికి తన జీవితకాలంలో కేవలం 20 ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలను మాత్రమే తీసుకోవడానికి వీలుగా ఒక పంచ్ కార్డును అందజేస్తే అతను ప్రతి నిర్ణయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి తీసుకుంటాడని, అదే ఉదాహరణ అందరికీ వర్తిస్తుందని అన్నారు. మార్కెట్‌లో కనిపించే ప్రతి స్టాక్ వెంట పడొద్దని, అవకాశం ఉన్న అత్యత నాణ్యమైన కంపెనీ స్టాక్‌లపైనే దృష్టి సారించాలని, దీంతో దీర్ఘకాలంలో భారీగా సంపదను కూడబెట్టడం సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రతి కంపెనీ అర్థం అవ్వాల్సిన పనిలేదు..
అప్పట్లో అమెజాన్ బిజినెస్ మోడల్ తనకు సరిగ్గా అర్థం కాలేదని, అందువల్ల ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టలేదని బఫెట్ తెలిపారు. ప్రతి కంపెనీని లేదా రంగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం పెట్టుబడిదారులకు లేదని, తనకు స్పష్టమైన పరిజ్ఞానం ఉన్న కోకాకోలా, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి కంపెనీలను ఎంచుకున్నానని, అందువల్లే తన కంపెనీ ఎన్నో ఏళ్లపాటు లాభాలను ఆర్జించగలిగిందని వివరించారు. ప్రస్తుతం ప్రపంచం, మార్కెట్లు చాలా వేగంగా ఉన్నాయని బఫెట్ అన్నారు. అందువల్ల రోజూ ట్రేడింగ్ చేసే అవకాశాలు చాలా మందికి లభిస్తాయని, దీంతో చిన్న తరహా ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతారని బఫెట్ అన్నారు. అయితే ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ ఏదైనా ఉత్తమ నిర్ణయాలను తీసుకున్నప్పుడే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రోజువారీ హెచ్చుతగ్గులకు ప్రభావితం కావొద్దని, మార్కెట్లపై దీర్ఘకాల దృష్టి ఉండాలని సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు ఇదే సమయం..?
ఆగస్టు 7, 2026

Penny Stocks | కాసుల వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్.. 6 నెలల్లో 198 శాతం లాభాలు..
ఆగస్టు 4, 2026

Trading | ట్రేడింగ్‌ను వృత్తిగా స్వీకరిస్తున్నారా.. సెబీ చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే..
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Stocks | ఎరోస్పేస్ రంగంలో దూసుకెళ్తున్న 3 కంపెనీలు.. భారీ రాబడులపై కన్నేసిన పెట్టుబడిదారులు..
- ●Assault | భార్యపై కోపంతో.. నాలుగేండ్ల కూతురిపై లైంగికదాడి..
- ●NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ చేసింది ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులే.. గుట్టు విప్పిన సీబీఐ
- ●Vivo S2 | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన వివో ఎస్2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..
- ●Doctor Suspended | తనకు బదులు విధులకు మరో వ్యక్తి.. జోగిపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు
- ●Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్

Stocks | ఎరోస్పేస్ రంగంలో దూసుకెళ్తున్న 3 కంపెనీలు.. భారీ రాబడులపై కన్నేసిన పెట్టుబడిదారులు..

Assault | భార్యపై కోపంతో.. నాలుగేండ్ల కూతురిపై లైంగికదాడి..

NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ చేసింది ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులే.. గుట్టు విప్పిన సీబీఐ

Vivo S2 | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన వివో ఎస్2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..



